చిరంజీవి తర్వాత వరుణ్ తేజ్ ఒక్కడే!

varun tej  after chiranjeeviదిల్ రాజు నిర్మిస్తున్న 25వ సినిమాగా భారీ పబ్లిసిటీ ఇచ్చిన “దువ్వాడ జగన్నాధమ్” ఆశించిన రీతిలో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైన విషయం తెలిసిందే. ఏపీ, తెలంగాణాలలో ఈ సినిమా కలెక్షన్స్ ‘ఓకే’ అనిపించే విధంగా ఉన్నప్పటికీ, ఓవర్సీస్ లో మాత్రం దారుణమైన పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. 2 మిలియన్ డాలర్స్ వసూలు చేస్తే గానీ, బ్రేక్ ఈవెన్ కానటువంటి ‘డీజే’ కేవలం 1.14 మిలియన్ డాలర్స్ కే క్లోజ్ అయ్యింది. దీంతో ఓవర్సీస్ పంపిణిదారులు భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది.

భారీ స్టార్ డం సొంతం చేసుకుని అల్లు అర్జున్ సాధించిన ‘డీజే’ కలెక్షన్స్ కంటే, ఒక్క భారీ హిట్టు కూడా లేనటువంటి వరుణ్ తేజ్, తన “ఫిదా” ద్వారా సదరు కలెక్షన్స్ ను బ్రేక్ చేసాడు. ఓవర్సీస్ లో బ్రహ్మాండమైన విజయం సాధించిన “ఫిదా” కలెక్షన్స్ ఓవరాల్ ‘డీజే’ను దాటి శరవేగంగా దూసుకెళ్తోంది. ఇప్పటివరకు దాదాపుగా 1.3 మిలియన్ డాలర్స్ ను వసూలు చేసిన “ఫిదా” ఈ వీకెండ్ ముగిసే సమయానికి దాదాపుగా 1.75 మిలియన్ డాలర్స్ కు చేరుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ADVERTISEMENT

ఓవరాల్ గా 2 మిలియన్ క్లబ్ లో చేరుతుందా లేదా అనేది ఈ వీకెండ్ గడిస్తే గానీ చెప్పలేం. అయితే ఇప్పటికీ మంచి వసూళ్ళనే సాధిస్తుండడంతో చిత్ర యూనిట్ కూడా ఆశాభావంతో ఉంది. చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల పుణ్యమా అంటూ 1 మిలియన్ క్లబ్ లో చేరిన వరుణ్, ఇప్పుడు ఏకంగా 2 మిలియన్ పై కన్నేశాడు. అదే జరిగితే మెగా హీరోలలో చిరంజీవి తర్వాత ఆ రికార్డును సొంతం చేసుకున్న మెగా హీరోగా వరుణ్ నిలుస్తాడు. ఇప్పటివరకు అల్లు అర్జున్ కే కాదు, పవన్ కళ్యాణ్ కు కూడా 2 మిలియన్ క్లబ్ లో సినిమా లేదన్న విషయం తెలిసిందే.

ADVERTISEMENT
Latest Stories