నల్లమల్ల సాగర్ వద్ద ట్రాఫిక్ జామ్ ఏంట్రా నాయినా!

Veligonda Project: Krishna Water Fills Nallamala Sagar

జగన్‌ అధికారంలో ఉన్నపుడే వెలిగొండ ప్రాజెక్టు పూర్తిచేసి జాతికి అంకితం ఇచ్చేసిన సంగతి తెలిసిందే. కానీ ఆయన హయంలో ఆ ప్రాజెక్టు నుంచి నల్లమల్ల సాగర్ జలాశయానికి చుక్క నీరు విడుదల కాలేదు.

ఒకవేళ విడుదలై ఉండి ఉంటే, నేడు దానిని చూసేందుకు వేలాదిమంది ప్రజలు క్యూకట్టేవారే కారు కదా? గత నెలాఖరున వెలిగొండ సొరంగ మార్గాల ద్వారా నీటిని విడుదల చేయడం ప్రారంభించినప్పటి నుంచి నల్లమల్ల సాగర్‌కు కృష్ణమ్మ నీళ్ళు కాలువ ద్వారా గలగలా పారుతూనే ఉన్నాయి.

ADVERTISEMENT

కరువు పీడిత ప్రాంతంలో తొలిసారిగా అంత నీరు పారుతుంటే చూసేందుకు చుట్టుపక్కల ప్రజలు కుటుంబ సమేతంగా కాలువ వద్ద జలహారతులు ఇస్తూనే ఉన్నారు. కార్లు, బైకులు వేసుకొని మరీ నల్లమల్ల సాగర్‌ కు తండోపతండాలుగా వస్తూనే ఉన్నారు.

ఒకప్పుడు అక్కడ కొండలు, గుట్టలు వాటి మద్యలో కొన్ని పల్లెలు తప్ప మరేమీ ఉండేవి కావు. కానీ ఇప్పుడు కొండపై నుంచి చూస్తే.. అక్కడ నిర్మించిన భారీ పంప్ హౌస్, వందల ఎకరాల విస్తీర్ణంలో కొండల మద్య కనుచూపు మేర నీటితో నిండిన నల్లమల్ల సాగర్‌ని కనువిందు చేస్తోంది. అది చూసి ప్రజలు ఆనందంతో పులకించిపోతున్నారు.

ఈ రెండు వారాలలో సుమారు 10-15 టీఎంసిల నీళ్ళు విడుదల చేస్తేనే నల్లమల్ల సాగర్‌ నీటితో కళకళలాడుతోంది. ఈ ప్రాజెక్టు పూర్తి నీటి నిలువ సామర్ధ్యం 43.50 టీఎంసిలు.

కనుక పూర్తిగా నిండితే ఇంకెంత అద్భుతంగా ఉంటుందో కదా?అని జనం అనుకుంటున్నారు. నల్లమల్ల సాగర్‌ని చూసేందుకు వస్తున్న జనం వారి వాహనాలతో ఆ ప్రాంతంలో నిత్యం విపరీతమైన రద్దీగా ఉంటోంది. దీంతో అక్కడ ప్రమాదాలు జరుగకుండా నివారించేందుకు ట్రాఫిక్ పోలీసులు రంగంలో దిగక తప్పలేదు.

వెలిగొండ ప్రాజెక్టు గురించి క్లుప్తంగా.. శ్రీశైలం జలాశయం వద్ద కొల్లంవాగులోని కృష్ణానది బ్యాక్ వాటర్స్ నుంచి నల్లమల్ల సాగర్‌కు నీటిని తరలించి, అక్కడి నుంచి ప్రకాశం, నెల్లూరు, కడప, మార్కాపురం జిల్లాలకు సాగు, త్రాగు నీటిని అందిస్తారు.

ఈ ప్రాజెక్టు ద్వారా ఈ నాలుగు జిల్లాల్లోని సుమారు 4.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు నిరంతర సాగునీరు అందుతుంది. పశ్చిమ ప్రకాశంలో 30 మండలాల్లోని సుమారు 1,657 గ్రామాల ప్రజలు ఫ్లోరైడ్ సమస్యతో బాధపడుతున్నారు. వారికి ఈ జలాశయం నుంచి స్వచ్ఛమైన తాగునీరు అందుతుంది. సిఎం చంద్రబాబు నాయుడు రాయలసీమలో రాజధాని అనలేదు. పెట్టలేదు. కానీ ఇలా అభివృద్ధి చేసి చూపిస్తున్నారు. మూడు రాజధానులు అంటూ ర్యాలీలు చేసిన సీమ వైసీపీ నేతలు ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటారో?

ADVERTISEMENT
Latest Stories