టిడిపి తరపున ప్రచారం నిర్వహించే ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కనుక ఆదేశిస్తే, ఎక్కడి నుంచైనా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నాడు. హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్ ని కలిసేందుకు వేణుమాధవ్ వెళ్లారు. అయితే పవన్ కల్యాణ్ అప్పుడే ఇంటికి వెళ్లడంతో వేణుమాధవ్ నిరాశ చెందాడు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ… పవన్ కల్యాణ్ కు కొత్త పంట బియ్యం ఇచ్చి, ఆయన తోటలో కాసిన మామిడి పండ్లను తీసుకెళ్లడం తనకు అలవాటని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజా సమస్యలపై పవన్ దృష్టి పెట్టడం మంచి పరిణామం అని, వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీ – జనసేన కలిసి పోటీ చేస్తాయని, అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని, జనసేన పార్టీకి తన పూర్తి మద్దతు ఉంటుందని పేర్కొన్నాడు.
ADVERTISEMENT
ADVERTISEMENT



