
ప్రస్తుతం దేశం మొత్తం ఛావా ఫీవర్ నడుస్తుంది. బాలీవుడ్ లో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా దేశ ప్రధాని మోడీ దృష్టిని కూడా ఆకర్షించగలిగింది. అయితే ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వర్షన్ కోసం ఇన్నాళ్లుగా ఆశగా ఎదురుచూసిన తెలుగు ప్రేక్షకులకు గీతా ఆర్ట్స్ మంచి శుభవార్తను అందించింది.
ఛావా మూవీ మార్చి 7 న తెలుగు వర్షన్ లో అటు ఆంధ్రా ఇటు తెలంగాణలో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది గీతా ఆర్ట్స్. విక్కీ కౌశల్, రష్మిక జంటగా నటించిన ఛావా ఇప్పటికే దేశ వ్యాప్తంగా 400 కోట్ల కలెక్షన్ సాధించింది. అయితే ఈ సినిమా కేవలం హిందీ భాషలో మాత్రమే రిలీజ్ అవ్వగా మిగిలిన రాష్ట్రాల ప్రేక్షుకులు కూడా తమ స్థానిక భాషలోకి ఈ మూవీ ని రిలీజ్ చెయ్యాలంటూ పట్టుబడుతున్నారు.
Also Read – మీరు ఎమ్మెల్యేలయ్యా… దొంగలుకారు!
అలాగే తెలుగు ప్రేక్షకుల నుంచి కూడా ఈ డిమాండ్ ఎక్కువగా రావడంతో ఈ బాధ్యతను గీతా ఆర్ట్స్ తన భుజాన వేసుకుంది. దీనితో ఛావా తెలుగు డబ్బింగ్ వర్షన్ కోసం గీతా ఆర్ట్స్ తనదైన నాణ్యత ప్రమాణాలను పాటించి తెలుగు వారికీ ఛావాను మరింత దగ్గర చేస్తుంది అనే అంచనాలు ఉన్నాయి.
అలాగే తెలుగు వర్షన్ లో హీరో కౌశల్ పాత్రకు డబ్బింగ్ కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముందుకొచ్చినట్టు మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టినప్పటికీ దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. అయితే హీరోయిన్ గా రష్మిక ఉండడం తెలుగు వర్షన్ కు అదనపు ఆకర్షణ అవుతుంది.
Also Read – సుప్రీంకోర్టుకే కుచ్చు టోపీ పెడుతున్నారే!
బాలీవుడ్ నుంచి ఈ ఏడాది మొదటి బాక్స్ ఆఫీస్ విజయాన్ని అందుకున్న ‘ఛావా’ ఛత్రపతి శంభాజీ జీవిత చరిత్రను నేటి సమాజానికి అర్థవంతంగా చెప్పి మెప్పించగలిగింది. అయితే ఇప్పటికే హిందీ వర్షన్ లో ఈ సినిమాను చూసి ఆస్వాదించిన తెలుగు ప్రేక్షకులు మరోసారి తమ సొంత భాషలో మూవీని ఎంజాయ్ చేయడానికి సై అంటున్నారు. దీనితో గీతా ఆర్ట్స్ ఖాతాలో మరో భారీ విజయం నమోదయినట్టే అంటున్నారు ట్రేడ్ పండితులు.