జగన్ రాజకీయ క్రీడలో బలవుతుంది ప్రతిపక్షాలా? ప్రజలా?

Andhra-Pradesh-YS-Jagan151 సీట్ల మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జగన్ అనుసరించే విధానాలతో బలవుతుంది ప్రతిపక్షాలా? ప్రజలా? అనే సందేహం ప్రతి ఒక్కరి మదిలో మెదులుతుంది. గత ప్రభుత్వ తాలూకా చిహ్నాలను తుడిపివేయాలన్న ఆలోచనలో ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన జగన్ పాలన చివరకు వైసీపీ ప్రభుత్వ కూల్చివేతతోనే ముగుస్తోందా? అన్న చందంగా ముందుకెళ్తున్నారు జగన్. టీడీపీ ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ సాక్షిగా ఎన్నుకున్న ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతిని కళ్ళ ముందే కాలరాయడం వలన ఓడిందెవరో? నెగ్గిందేవరో? ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచించాలి.

ADVERTISEMENT

అత్యధిక మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన జగన్, పరిశ్రమల ఏర్పాటు, మౌలిక వసతుల కల్పన,నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, ప్రభుత్వ ఆసుపత్రుల పునరుద్ధరణ వంటి కార్యక్రమాలతో ప్రజల ముందుకి వస్తారనుకుంటే ప్రజా ఆస్తుల కూల్చివేతలతో , ప్రతిపక్ష నేతల ఇళ్ల పైకి దాడులతో, విపక్ష పార్టీల కార్యాలయాల మీద విధ్వంసాలతో, ప్రత్యర్థి పార్టీల నాయకుల మీద కేసులతో ముందుకెళ్తున్నారు. ప్రత్యర్థులను మట్టుపెట్టాలి అనే ఆలోచనతో రాష్ట్ర పాలన పై దృష్టి పెట్టకుండా జగన్ అనుసరిస్తున్న ఈ రాజకీయ విధానాలకు బలిపీఠం ఎక్కేది ఎవరో? వైసీపీ ప్రభుత్వం బదులు చెప్పాలి.

వైసీపీ కి ఓటువేసినందుకు ప్రజలకు దక్కిన ఫలితమే రాష్ట్రంలో నెలకొన్న ఈ అస్థిరత్వం. దేశంలోనే రాజధాని లేని ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిబడడానికి కారణం ఎవరో రాష్ట్ర ప్రజలు గమనించాలి. ప్రత్యర్థుల పై పగ సాధించడానికి ముఖ్యమంత్రి పదవిని అడ్డుపెట్టుకుని జగన్ ఆడుతున్న ఈ రాజకీయ క్రీడలో నలిగిపోతుంది ప్రజలే అనే విషయం అటు వైసీపీ ప్రభుత్వం గుర్తిస్తే రాష్ట్రానికి
మేలు జరుగుతుంది.

అమరావతి నిర్మాణాలను అడ్డుకోవడం వలన నష్టపోయింది టీడీపీ ప్రభుత్వం కాదు, రాష్ట్ర ప్రజలే! వందలాది మంది శ్రామికుల ఉపాధిని ఒక్క ప్రకటనతో కాలరాసిన ఈ ప్రభుత్వం బలిచేసింది టీడీపీ పార్టీనా, లేక సామాన్యులనా? గత ప్రభుత్వం తాలూకా ఇసుక పాలసీ మార్పు అంటూ వైసీపీ ప్రభుత్వం చేసిన కాలయాపన వేలమంది భవన నిర్మాణ కార్మికుల పొట్టిక్కొట్టింది. కొన్ని కుటుంబాల చావులకు సాక్ష్యాలుగా మిగిలింది.ఈ విధ్వసం తాలూకా ఫలితం గత ప్రభుత్వం అనుభవించిందా? లేక అది సామాన్యుడి మెడకు ఉరితాడయ్యిందా? అనే ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎవరిదో? ఒక్కసారి అందరు ఆలోచించాలి.

రాజకీయ పార్టీల రాజకీయ క్రీడలో బలయ్యేది సామాన్య కార్యకర్తలే. అలాగే ప్రభుత్వాల రాజకీయ క్రీడలో బలయ్యేది సామాన్య ప్రజలే కానీ రాజకీయ పార్టీలు కాదనే సత్యాన్ని గుర్తించి ప్రజలు ముందుకెళ్తేనే రాష్ట్ర భవిష్యత్.

ADVERTISEMENT
Latest Stories