మెగాస్టార్ చిరంజీవితో బ్లాక్ బస్టర్ మూవీస్ ను తెరకెక్కించడంతో పాటు, ఇండస్ట్రీకి సినీ వారసులను పరిచయం చేసే సంస్థగా వైజయంతీ మూవీస్ కు ఒక విశిష్టమైన గుర్తింపు ఉండేది. అయితే ఒక దశాబ్ద కాలంగా సినీ నిర్మాణాలకు దూరంగా ఉన్న ఈ సంస్థ, ఈ ఏడాది విడుదలైన “మహానటి” సినిమాతో తన పునర్వైభావాన్ని చాటుకుంది. అలాగే వరుసలో నాగ్ – నానిల మల్టీస్టారర్ “దేవదాస్” మరియు మహేష్ “మహర్షి”లను కూడా నిలిపారు.
[m9ad]
తాజాగా మరికొన్ని సినిమాలను కూడా ప్రకటించారు అశ్వనీదత్. ‘దేవదాస్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఖరారు చేస్తూ రాబోవు చిత్రాల గురించి కీలకమైన సమాచారాన్ని అందించారు. ప్రస్తుతం యూత్ ను ఊపేస్తోన్న విజయ్ దేవరకొండ హీరోగా ఒక సినిమాను, జూనియర్ ఎన్టీఆర్ తో ఒక భారీ సినిమాను చేయబోతున్నట్లుగా స్పష్టం చేసారు. అలాగే తమిళ దర్శకుడు అట్లీతో మరో సినిమా చేయబోతున్నట్లుగా తెలిపారు.
ఈ సినిమాలన్నీ ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉన్నాయని, ఇవే కాక మరికొన్ని సినిమాలు కూడా ప్లానింగ్ లో ఉన్నాయని, ఓకే అయిన తర్వాత వాటిని కూడా అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు. భారీ సినిమాలను తెరకెక్కించే సంస్థగా ఖ్యాతి పొందిన వైజయంతీ సంస్థ, మళ్ళీ టాలీవుడ్ లో వరుసగా సినిమాలు నిర్మిస్తూ యాక్టివ్ కావడం ఆహ్వనించదగ్గ పరిణామం. వైజయంతీకి గత వైభవం రావాలని ఆశిద్దాం.



