Vijay Devarakonda Next with Director Mani Ratnam“అర్జున్ రెడ్డి” సినిమాతో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిన విజయ్ దేవరకొండ దశ తిరిగినట్లే కనపడుతోంది. ఇప్పటికే టాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారిన విజయ్ కు అగ్ర బ్యానర్లలో మరియు అగ్ర దర్శకుల చిత్రాలు దక్కుతున్నాయి. తాజా ట్రేడ్ టాక్ ప్రకారం… ఎవరూ ఊహించుకొని ప్రాజెక్ట్ విజయ్ వశమైందని తెలుస్తోంది.

ఎందరో అగ్ర హీరోలు ఎదురుచూసే దర్శకుడిగా ఖ్యాతి గడించిన మణిరత్నం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించబోతున్నాడనే ఈ వార్త ట్రేడ్ వర్గాలను షాక్ కు గురి చేస్తోంది. మణిరత్నంతో చేయడానికి ప్రిన్స్ మహేష్ బాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వంటి వారు ఎన్నాళ్ళ నుండో ఎదురు చూస్తుండగా, ఒక్క ‘అర్జున్ రెడ్డి’తో విజయ్ దక్కించుకోవడం విశేషం.

మణిరత్నంతో మూవీ అంటే అది ఒక్క భాషకే పరిమితం కాదు. అది తెలుగు భాషలో తెరకెక్కినా, ఆ సినిమా జాతీయ స్థాయిలో మారుమ్రోగుతుంది. ఇప్పుడిప్పుడే హీరోగా ఎదుగుతున్న విజయ్ దేవరకొండకు ఇలాంటి అవకాశం దక్కడమంటే మాటలు కాదు. అయితే పక్కా క్లాస్ మణి సొంతం కాగా, మాస్ విజయ్ బాణీగా మారింది. మరి ఈ కాంభినేషన్ అంటే ఆ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.