విజయ్ దేవరకొండ… సొంతంగా పైకి వచ్చి స్టార్డం సంపాదించుకున్న హీరో. అర్జున్ రెడ్డి తర్వాతి నుండి ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఇప్పుడిప్పుడే లైగర్ దెబ్బ నుంచి కోలుకుంటున్నాడు. ఒక సాలిడ్ హిట్ పడితే కొంత మేరకి రిలీఫ్ వస్తది.
ఇక లేటెస్ట్ గా విజయ్ చేస్తోన్న ఒక పని అటు ప్రశంసలు దక్కించుకుంటూనే కొన్ని విమర్శలకు కూడా తావు ఇచ్చింది. వివరాల్లోకి వెళితే, విజయ్ దేవరకొండ రీసెంట్ గా ఖుషి ఈవెంట్ లో మాట్లాడుతూ దేవర ఫ్యామిలీ అయిన ఫ్యాన్స్ కోసం ఏదైనా చేయాలని ఉందని అందుకోసం ఒక కోటి రూపాయలు ఖర్చుపెడుతున్నట్లు తెలిపాడు.
తన ఫ్యాన్స్ లో నుండి అర్హులైన 100 మందిని ఎంపిక చేసి వారికి తలా లక్ష చొప్పున కోటి రూపాయలు ఇస్తానని ప్రకటించాడు.
ఈ తరహా చర్య, ఫ్యాన్స్ కు డబ్బులు ఇవ్వడం అనేది బహుశా ఏ హీరో కూడా ఇంతలా చేయలేదేమో. దీనికి విజయ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ. నిజంగా ఈ చర్యను అందరూ అభినందించాల్సిందే.
అయితే ఇందులోనే మరో కోణం చూస్తున్నారు కొంత మంది. ఫ్యాన్స్ కు డబ్బులిస్తున్నావు సరే, మరి బయ్యర్ల మాటేంటి దేవర అంటూ సోషల్ మీడియాలో సూటిగానే ప్రశ్నిస్తున్నారు. వివరాల్లోకి వెళితే విజయ్ రీసెంట్ సినిమాలు వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్ చిత్రాలను కొనుగోలు చేసి దారుణంగా నష్టపోయారు బయ్యర్లు.
లాభాలు వచ్చినప్పుడు డబ్బులు బయ్యర్లు వెనక్కి ఇవ్వరు కదా మరి ఎందుకని నష్టాలు వచ్చినప్పుడు అడుగుతారు అని అంటే దానికి నైతికత ఒకటే సమాధానం. ఒక హీరోగా తన బయ్యర్లను జాగ్రత్తగా చూసుకోవాల్సిన నైతిక బాధ్యత ఏహీరోకైనా ఉంటుంది.
ఆ రకంగా వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్ నష్టాల సినిమాలు కొనుక్కుని నిండా మునిగిపోయిన బయ్యర్లు ఉన్నారు. ఇప్పుడు ఖుషి కూడా అన్ని ఏరియాస్ లో బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదో చూడాలి.
ఇలాంటి పరిస్థితిలో ఫ్యాన్స్ ను ఖుషి చేస్తోన్న విజయ్ బయ్యర్లను కూడా పట్టించుకుంటే బాగుంటుంది అని అంటున్నారు సోషల్ మీడియాలో.



