ఏ టెన్షన్ లేకుండా క్రికెట్ మ్యాచ్లు ఎంజాయ్ చేస్తున్న మాల్యా

India vs England-Viajy Mallyaభారత్ లోని బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి పరారీలో ఉన్న విజయ్ మాల్యా ఒక పక్క అతడిని దేశానికి రప్పించేందుకు భారత్ ఓ వైపు ప్రయత్నాలు చేస్తుంటే అతడు మాత్రం క్రికెట్ మ్యాచ్‌లను చూస్తూ హ్యాపీగా గడుపుతున్నాడు. భారత్-ఇంగ్లండ్ మధ్య కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో జరుగుతున్న చివరిదైన ఐదో టెస్టుకు వరుసగా మూడో రోజూ కూడా హాజరయ్యాడు.

[m9ad]

ADVERTISEMENT

క్రికెట్‌ను ఎంతగానో ఇష్టపడే మాల్యా లండన్‌లో జరుగుతున్న ప్రతీ మ్యాచ్‌కు హాజరవుతుండడం విశేషం. మాల్యా చేస్తున్న ఈ పని వల్ల దేశం పరువు పోవడమే కాకుండా మోడీ ప్రభుత్వానికి తీవ్ర అప్రతిష్ట తెచ్చిపెడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అతడు మ్యాచ్‌ను వీక్షిస్తున్న ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి.

వేల కోట్లు ఎగ్గొట్టిన ఘరానామోసగాడు హాయిగా పరాయి దేశంలో కూర్చుకుని ఎంజాయ్ చేస్తూ దేశాన్నే సవాలు చేస్తుంటే ప్రభుత్వం ఏమీ చేస్తుందనేది అందరూ అడుగుతున్న ప్రశ్న. అయితే మాల్యాను తిరిగి రప్పించడం అంత తేలిక కాదని అక్కడ కోర్టులలో ఆయనను అప్పగించామని పోరాడుతున్న అధికారులు చెబుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories