కొత్త సంవత్సరం మొదటి రోజు కూడా రాజకీయమేనా?

Vijay Sai Reddyకనీసం సంవత్సరం మొదటి రోజైనా పాజిటివ్ గా మాట్లాడటానికి ఇబ్బంది పడుతున్నారు మన రాజకీయ నాయకులు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి సీఎంగా ఇదే చివరి జనవరి 1 అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి జోస్యం చెప్పారు. 2014లో ఏపీ ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఈ ఏడాది వెనక్కు తీసుకోబోతున్నారని, ఇక ఆయన తన మనవడితో ఆడుకోవచ్చని ట్వీట్‌ చేశారు. ఇంతకంటే చంద్రబాబు తెలుగు ప్రజలకు ఇవ్వగలిగింది ఏముంటుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ADVERTISEMENT

[m9ad]

కొత్త సంవత్సరంలో వైకాపా అధికారంలోకి రావాలి అని కోరుకోవడం తప్పేమీ కాదు. అయితే సంవత్సరం మొదటి రోజే రాజకీయ విమర్శలు శాపనార్ధాలు ఎందుకో మరి. ఇవాళా రేపు రాజకీయాలలు అంటే తిట్టుకోవడం ఒకరినొకరు శాపనార్ధాలు పెట్టుకోవడం లాగే సాగుతున్నాయి. కింద స్థాయి నేతలు ఎలా ఉన్నా కనీసం ప్రధాన పదవులలో ఉన్న వారైనా ఇటువంటి పుట్టిన రోజులు, పండుగలు, ఇటువంటి ముఖ్యమైన రోజులలో కొంచెం హుందాగా ప్రవర్తించి మార్గదర్శకంగా ఉండొచ్చు. ఈ మధ్య జగన్, చంద్రబాబులు పుట్టిన రోజులలో ఒకరికొకరు విషెస్ చెప్పుకుంటూ కొత్త సంప్రదాయానికి తెర తీశారు.

కనీసం జగన్ నుండి కూడా విజయసాయి నేర్చుకోవడం లేదు. చంద్రబాబు పేరు ఎత్తితే విరుచుకుపడే విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో ఈ మధ్య యాక్టీవ్ గా ఉంటున్నారు. ఆయన ట్విట్టర్ పెద్దగా ప్రాచుర్యంలో లేకపోయినా ఆయన అందులో తరచు పెట్టే కార్టూన్ల మీద కూడా తరచు వివాదాలు చెలరేగుతాయి. పెద్దల సభలోని ఎంపీ స్థాయికి ఆయన వేసే కార్టూన్లు, పోస్ట్లు ఉండవని పలువురి విమర్శ. అయితే రాజకీయ నాయకులు గుణపాఠాలు ఎన్నికల సమయంలో ప్రజలతో ఓట్లతోనే తెలుసుకుంటారు. మిగిలిన రోజులలో వారికి ఏవీ వినపడవు కనపడవు. అయితే ఇది ప్రజాస్వామ్య దౌర్భాగ్యమే.

ADVERTISEMENT
Latest Stories