Virat Kohli is Back in Ranji Trophy

ఓ పక్క రోహిత్, జైస్వాల్, అయ్యర్, జడ్డు, పంత్ వంటి అంతర్జాతీయ ఆటగాళ్లు జనవరి 22 నుండి మొదలైన రంజీ రౌండ్ లో పాల్గొనగా,ఆ రౌండ్ కు విరాట్ కోహ్లీ మరియు రాహుల్ గాయాల వలన అందుబాటులో లేరు. అయితే, జనవరి 30 నుండి మొదలైన రౌండ్ లో వీరు పాల్గొననున్నట్లు ముందుగానే వెల్లడించారు ఆయా రాష్ట్ర బోర్డులు.

మళ్ళీ దాదాపు 13 ఏళ్ళ తరువాత రంజీ మ్యాచ్ లలో విరాట్ కోహ్లీ దర్శనమివ్వనున్నాడనే వార్త తెలియటంతోనే సగం ఢిల్లీ నగరమంతా గ్రౌండ్ దగ్గరే ఉన్నట్టుగా కోలాహల వాతావరణం నెలకొంది. దేశ రాజధాని వీధులన్నీ కోహ్లీ అభిమానులతో కిక్కిరిసిపోతాయని భారత సీనియర్ ఎనలిస్టులు ముందుగానే జోస్యం చెప్పారు. అనుకున్నట్టుగానే క్రికెట్ అభిమానులంతా గ్రౌండ్ నలువైపులను చుట్టుముట్టేశారు.

Also Read – అమరావతిలో బసవతారకం….

రోహిత్, పంత్, జడ్డు వంటి స్టార్ ప్లేయర్స్ రాకకు దేశమంతా రంజీల వైపుకు చూసింది. అయితే, ఈ జోన్ లో కి కోహ్లీ ఎంట్రీ ఇవ్వటంతో క్రికెట్ ప్రపంచమంతా ఇప్పడు రంజీ పైనే వేయి కళ్లు పెట్టింది. అది ఇవాళ్టి మ్యాచ్ కు 6 -7 గంటల ముందు నుండే ఫిరో షా కోట్ల మైదానం లో వాతావరణం బట్టి అర్ధమయింది. సుమారు అర్ధరాత్రి 3 గంటల నుండే ఢిల్లీ వీధులు కిక్కిరిసిపోయాయి. ఢిల్లీ లో ఆ చలిని కాస్తూ, జనులందరు టికెట్ కౌంటర్ ల వద్దకు పోటెత్తారు.

రైల్వేస్ తో జరిగిన ఈ మ్యాచ్ మొదలయేసరికి గ్రౌండ్ బయట సుమారు 2 కిలోమీటర్ల పొడవు క్యూలు లైన్ ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ క్యూ లైన్ లో నిల్చున్న వారు ఆ క్యూ ను వీడియో తీసి సోషల్ మీడియా లో అప్లోడ్ చేస్తూ ‘కింగ్ క్రేజ్ ఇది! క్రేజ్ కా బాప్ కింగ్ కోహ్లీ” అంటూ రకరకాల క్యాప్షన్లతో హడావుడి చేస్తున్నారు. ఇక, గేట్ 16 వద్ద అయితే స్వల్ప తొక్కిసలాట జరిగినట్లు సమాచారం.

Also Read – అందరికీ ఓ రెడ్‌బుక్ కావాలి.. తప్పు కాదా?


ఆ తొక్కిసలాటలో ఒక పోలీస్ వాహనంతో పాటుగా అక్కడికి వచ్చిన వీక్షకుల వస్తువులు చెల్లాచెదురయ్యాయి. గ్రౌండ్ లోపల చూసుకుంటే, స్టేట్ బోర్డు సెక్యూరిటీ ని పెంచినప్పటికీ, వారందరిని దాటుకుంటూ, ఒక అభిమాని కోహ్లీ కాళ్ళ మీద పడిన వీడియో కూడా ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతుంది. ఒక అంతర్జాతీయ మ్యాచ్ కు కూడా లేనంతగా కోహ్లీ రాకతో ఈ మ్యాచ్ పై హైప్ ఏర్పడింది. ఇవన్నీ చూసాక, ‘ఫామ్ తగ్గినా, కింగ్ ఫేమ్ తగ్గదు” అనేది స్పష్టమవుతుంది.