ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో తాజా హాట్ టాపిక్ నకిలీ మద్యం తయారీ అంశం పై అటు అధికార టీడీపీ, ఇటు విపక్ష వైసీపీ ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నా అసలు వాస్తవాలు బట్టబయలయ్యాయి. అయితే ఈ నకిలీ దందా మొత్తం ఒక సినిమా స్క్రిప్ట్ ను పోలినట్టుగా కనిపిస్తుంది.
ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారమే పలానా ప్లేస్ లో నేను ఈ నకిలీ మధ్యం తయారీ ప్రక్రియను ప్రారంభిస్తాను, ఆ తరువాత మనలో ఒకరు ఇక్కడ నకిలీ మధ్యం తయారు చేస్తున్నారు అంటూ పోలీసులకు సమాచారం ఇద్దాం, ఆ తరువాత మీడియాలో ఆ వార్త సంచలనంగా మారుతుంది,
ఇదంతా కూడా బాబు ప్రభుత్వానికి అప్రతిష్టను తెస్తుంది ఇదే మన నకిలీ మద్యం సినిమాకి స్క్రిప్ట్ అంటూ కథ మొదలు పెట్టిన మాజీ మంత్రి జోగి రమేష్ తెరముందు మాత్రం అద్దెపల్లి జనార్దన్ ను పెట్టారు. అయితే ఈ అంశంలో కూటమి ప్రభుత్వం వేగంగా చర్యలు ప్రారంభించడంతో జనార్దన్ రావు ను అదుపులోకి తీసుకుని విచారణ మొదలు పెట్టింది.
ఈ ప్రభుత్వ చర్యలతో తెరవెనుకున్న అసలు సూత్రదారులు కూడా వెంటనే బయటకొచ్చారు. ఇబ్రహీంపేటలో మొదలవ్వాల్సిన ఈ కథను జోగి తంబళ్లపల్లె కు మార్చారు. ఈ కేసులో A-1 ఉన్న జనార్దన్ రావు తో మాజీ మంత్రి జోగి చేసిన వాట్స్ అప్ చాట్ బయటకు లీక్ అవ్వడంతో సినిమా కథ క్లైమాక్ కు రాకముందే వాట్స్ అప్ లో లీకయ్యింది అన్నట్టుగా జోగి నకిలీ రంగు గుట్టు రట్టయింది.
ఈ చాట్ లో విషయాలుపరిశీలిస్తే … బాబు ప్రభుత్వం ఆధికారంలోకి వచ్చిన తరువాత తానూ నకిలీ మధ్యం తయారు చేయడం ఆపేసానని, అయితే తిరిగి జోగి రమేష్ ప్రమేయం తో నే తిరిగి ఈ దందా మొదలు పెట్టినట్టు చెప్పుకొచ్చారు జనార్దన్ రావు.
కూటమి ప్రభుత్వ ప్రతిష్టతను దెబ్బ తీయడం, బాబు కి అపఖ్యాతి అంటకట్టడమే ప్రధమ లక్ష్యంగా ఈ వ్యాపారం మొదలు పెట్టినట్టు ఆ చాట్ లో స్పష్టంగా తెలుస్తుంది. అలాగే అందుకు అవసరమైన ఆర్థిక సాయం కూడా జోగి అందించినట్టు సాక్ష్యాలు కనిపిస్తున్నాయి.
అయితే కేవలం ఒక పార్టీ మీద రాజకీయంగా పగ సాధించేందుకు, ఒక ప్రభుత్వం మీద నకిలీ నిందలు వేసేందుకు ఒక నాయకుడి నిబద్ధతను అనుమనించేందుకు జోగి రమేష్ మద్యం ప్రియుల ప్రాణాలను బలి పీఠం ఎక్కిస్తారా.? వారి అలవాటుతో తమ రాజకీయ లెక్కలు సరిచేయాలని భావిస్తారా.?
ఆ నకిలీ మద్యం తాగడంతో ఎవరి ప్రాణాలైనా పొతే ఎన్ని కుటుంబాలు రోడ్డున పడతాయి.? ఎంతమంది తల్లులను కడుపుశోకం వెంటాడుతుంది.? అలాగే ఎందరి మహిళల పసుపు కుంకాలు వీరి రాజకీయ రక్త దాహానికి బలి కావాలి.? ఇదేనా వైసీపీ రాజకీయం.? ఇందుకేనా వైసీపీ కి మరో అవకాశం.?
ఒకపక్క వైసీపీ నాయకులు మనుషుల ప్రాణాలతో నకిలీ వ్యాపారం చేస్తూ రేపు అదే మనుషులు ప్రాణాలు కోల్పోతే మరోపక్క పార్టీ అధినేత వైస్ జగన్ ఓదార్పు యాత్రలంటూ శవ రాజకీయాలు చేస్తారా.? నాడు వివేకా హత్య ఉదంతం – నేడు వైసీపీ చేసే రప్ప రప్ప రాజకీయాలు ఇంకెంత కాలం.? ఇటువంటి వారిని ఉపేక్షిస్తే వీరి రాజకీయానికి ఇంకెన్ని ప్రాణాలు బలికావాలో.?




