జనసేనాని అమరావతికి మారరా?

When Pawan Kalyan moving to amaravatiజనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవలే అమరావతిలో తన సొంత ఇంటికి శంకుస్థాపన చేశారు. రెండు ఎకరాల స్థలంలో తన ఇల్లు, పార్టీ ఆఫీసు ఉంటుందని ఆయన చెప్పారు. అతితొందర్లొ నిర్మాణం పూర్తి చేసి అమరావతికి పూర్తిగా షిఫ్టు అవ్వబోతున్నట్టు ప్రకటించారు. అయితే ఉన్నఫళంగా ఆయన హైదరాబాద్ లో కొత్త ఆఫీసులోకి మారబోతున్నట్టు సమాచారం.

ADVERTISEMENT

ప్ర‌స్తుత పార్టీ కార్య‌ల‌యాన్ని వదిలి హైటెక్ సిటీలోని ఇన్రార్బిట్ మాల్ ద‌గ్గ‌ర నూత‌న కార్య‌ల‌యం కోసం మూడంత‌స్తుల భ‌వ‌నాన్ని లీజుకు తీసుకున్నట్టు సమవిహారం. త్వ‌ర‌లో ప‌వ‌న్ చేతుల మీదిగా పార్టీ కార్య‌ల‌యం ప్రారంభం కాబోతుంది. మూడంతస్తుల్లో మ‌హిళ‌,యువ‌త‌,మీడియా విభాగాల‌కు ప్ర‌త్యేక ఏర్పాట్లు ఉంటాయట.

అయితే అమరావతికి ఇప్పట్లో మారే అవకాశం లేనట్టేనా? ఉంటే ఉన్నఫళంగా ఈ వేరే ఏర్పాట్లు ఎందుకు అని అభిమానులు అనుకుంటున్నారు. కొందరేమో అమరావతిలో కార్యాలయం ఉన్నా తెలంగాణ పార్టీ కోసం వేరే ఆఫీసు హైదరాబాద్ లో నెలకొలుపుతుండొచ్చు అనే అభిప్రాయంలో ఉన్నారు.

ADVERTISEMENT
Latest Stories