Jagan CBI

సుమారు 12 ఏళ్ళ క్రితం అప్పటి సీబీఐ జాయింట్ డైరెక్టర్‌ లక్ష్మినారాయణ వైసీపి అధినేత జగన్‌ తదితరుల అక్రమాస్తుల కేసులను లోతుగా దర్యాప్తు జరిపి 11 ఛార్జ్ షీట్లు దాఖలు చేశారు. అలాగే సుమారు 6 ఏళ్ళ క్రితం జరిగిన వివేకానంద రెడ్డి హత్య కేసుపై నేటికీ సీబీఐ అధికారులు విచారణ జరుపుతూనే ఉన్నారు.

ఈ రెండు కేసుల విచారణ వేగంగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు చెప్పగా, ఆ కోర్టులోనే మళ్ళీ వేర్వేరు కారణాలతో పిటిషన్లు వేస్తూ, దాని చేతే వాటిపై విచారణ జరిపించడం మన న్యాయవ్యవస్థ బలహీనతని ఎత్తిచూపుతున్నట్లుంది. అలాగే వివేకా హత్య కేసు విచారణ జరిపిన సీబీఐ అధికారి మీదే నిందితులు ఎదురుకేసు వేసి కోర్టులు చుట్టూ తిప్పించడం మన ప్రజాస్వామ్య వ్యవస్థలో మరో సరికొత్త రికార్డ్ అని చెప్పుకోవచ్చు.

Also Read – నారదుడుకి తక్కువేమీ కాదు.. మన వర్మ

అక్రమాస్తుల కేసులో, కోడికత్తి కేసులో జగన్మోహన్‌ రెడ్డిని కోర్టుకి రప్పించలేని నిసహాయత న్యాయవ్యవస్థని ఆవరించిందని అనుకోవడానికి లేదు. అదే న్యాయవ్యవస్థ తెలంగాణ మంత్రి కొండా సురేఖ-అక్కినేని నాగార్జున కేసులో చాలా చురుకుగా స్పందించింది.

అక్కినేని నాగార్జున నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేసిన మూడు రోజులలోనే నాగార్జున వాంగ్మూలం, ఆ మర్నాడు సాక్షుల వాంగ్మూలాలను న్యాయస్థానం రికార్డ్ చేసింది. ఈ వారంలోనే మంత్రి కొండా సురేఖ వాంగ్మూలం కూడా తీసుకోబోతోంది. ఆ తర్వాత ఈ కేసు విచారణ మొదలవుతుంది.

Also Read – జగన్‌ సంక్రాంతికే.. ప్రీ రిలీజ్ ఈ నెలలోనే!

ఈ కేసులో న్యాయస్థానం ఇంత చురుకుగా చర్యలు తీసుకోగలుగుతున్నప్పుడు, జగన్‌ అక్రమస్తుల కేసులలో, వివేకా హత్య కేసులో ఏళ్ళ తరబడి ఎందుకు విచారణ సాగదీస్తోంది? అనే సందేహం కలుగకమానదు.

న్యాయ ప్రక్రియలో ఇటువంటి తేడాల కారణంగానే ‘న్యాయం అందరికీ సమానమే కానీ కొందరికి అధిక సమానమని’ చలోక్తులు పుట్టుకొచ్చాయని భావించవచ్చు.

Also Read – నాడు – నేడు ప్రజా నాయకుడేనా….

ఏళ్ళ తరబడి జగన్‌ కేసులపై విచారణ కొనసాగుతుండటం చూస్తున్నప్పుడు న్యాయస్థానాలు దోషులను గుర్తించి చట్ట ప్రకారం శిక్షించేందుకే వాటిపై విచారణ జరుపుతున్నాయా లేదా జగన్‌ కేసులతోనే న్యాయస్థానాలు పని చేస్తున్నాయా? అనే సందేహం కలుగుతుంది ఎవరికైనా.