శివ సినిమాతో టాలీవుడ్ కు ఒక కొత్త ట్రెండ్ ను పరిచయం చేస్తూ తనను తానూ ఒక ప్రత్యక దర్శకుడిగా తెలుగు ప్రజలకు పరిచయం చేసుకున్నారు రామ్ గోపాల్ వర్మ. అయితే అలా సినీ దర్శకుడిగా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎదిగిన రామ్ గోపాల్ వర్మ గత కొన్నేళ్లగా తన సినిమాలతో ప్రేక్షకుడి సహనానికి పరీక్షలు పెడుతున్నారు.
అయితే అక్కడితో కూడా ఆగేదెలా అన్నట్టుగా గత కొన్నేళ్లుగా రాజకీయంగానూ యాక్టీవ్ గా మారి వైసీపీ కి మద్దతుగా టీడీపీ, జనసేనలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో డ్యూటీ చేసారు ఆర్జీవీ. అలాగే టీడీపీకి వ్యతిరేకంగా జనసేనను రెచ్చకొట్టేలా చిత్రాలు తీసి వైసీపీ కి తనవంతు సహకారం అందించారు.
ముఖ్యంగా మెగా ఫ్యామిలీ ని అటు రాజకీయంగా విమర్శిస్తూ ఇటు సినిమా ల పరంగా కించపరుస్తూ పైశాచిక ఆనందాన్ని అనుభవించారు. నేను మెగా అభిమానినే పవర్ స్టార్ పవన్ కు డై హార్డ్ ఫ్యాన్ నే అంటూ మెగా అభిమానులను రెచ్చకొట్టేలా తన వైపుకు లాగేవారు.
అలాగే మెగా ఫ్యామిలీ నుంచి ఎవరి సినిమా అయినా మరీ ముఖ్యంగా పవన్ చిత్రాలు రిలీజ్ అవ్వగానే ఒక మూవీ రివ్యూవర్ గా అవతారం ఎత్తి ఆ సినిమాలో పవన్ నటన నుంచి మూవీ ఫలితం వరకు వ్యంగ్యంగా, వెటకారంగా తన సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టే వర్మ నేడు మూగబోయారు.
మొన్న జులై లో పవన్ ‘హరిహర వీరమల్లు’ థియేటర్లలోకి వచ్చింది వెళ్ళింది. ఇక ఇప్పుడు ‘థె కాల్ హిం ఓజి’ అంటూ బాక్స్ ఆఫీస్ రికార్డు ల దిశగా దూసుకుపోతుంది ఓజి. అయితే నాటి హరిహర వీరమల్లు మూవీ ఫలితం మీద కానీ నేడు ఓజి చిత్రం క్రెజ్ గురించి కానీ ఆర్జీవీ తన సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు..వై.?
నాడు అసభ్యకర రీతిలో రెచ్చిపోయిన ఆర్జీవీ నేడు కనీసం స్పందించడానికి కూడా సాహసించలేకపోతున్నారా.? టీడీపీ కి వ్యతిరేకంగా ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అంటూ రెచ్చిపోయిన ఆర్జీవీ, వ్యూహం, శపథం అంటూ జనసైనికులను రెచ్చకొట్టిన ఆర్జీవీ ఇప్పుడు మూగబోయారు.
కూటమి దెబ్బకు సోషల్ మీడియాలో నిశ్శబ్దాన్ని పాటిస్తూ, రాజకీయాలకు, మెగా కుటుంబానికి దూరంగా ఉంటూ వైసీపీ సేవ నుంచి డ్యూటీ దిగారా.?




