ఇందుకేనా జగన్ నీడ్స్ ఏపీ?

Jagan-Needs-APనేడు విజయవాడలో జరుగుతున్న వైసీపీ ప్రతినిధుల సభలో జగన్ రానున్నకాలంలో తన పార్టీ నేతలు అనుసరించాల్సిన కార్యక్రమాలను తెలియచేస్తూ తమ పార్టీ బలం ఏమిటో ప్రజలకు తెలియచేయాలి సూచించారు.రానున్న ఎన్నికలు పేదలకు – పెత్తందారులకు మధ్య జరిగే యుద్ధమే అన్న జగన్ ఇంతకీ రాష్ట్రంలో పేదవారు ఎవరో పెత్తందారులు ఎవరో కూడా కాస్త సెలవిస్తే కానీ ‘గూగుల్ తల్లి’ తన తప్పుని సరిచేసుకుంటుందేమో.

దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రి ఎవరు అని గూగుల్లో అడిగితే జగన్ మోహన్ రెడ్డి పేరు బయటకు వస్తుంది కారణం ఏమిటో ఒక్కసారి వైసీపీ నేతలు దానిని బదులిస్తే పోలా? మాట ఇచ్చి తప్పడం తమ పార్టీకి తెలియదని,చంద్రబాబు మాదిరి వెన్నుపోటు పొడవడం తమకు తెలియదని,బాబు మాదిరి ప్రజల సొమ్ముని దోచుకోవడం – దాచుకోవడం తమకు తెలియదని,విలువలు – విశ్వసనీయతే తమ పెట్టుబడులుగా,సంక్షేమ పథకాలే కవచాలుగా, ప్రజలే తమ బలంగా పార్టీని ప్రజాక్షేత్రంలోకి తీసుకువెళ్ళలంటూ నేతలకు జగన్ గీతోపదేశం చేశారు.

ADVERTISEMENT

రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అంటూ ఇచ్చిన మాట తప్పిందెవరో? బహుశా ప్రజలే అంటారేమో మరి! తల్లికి, చెల్లికి, బాబాయికి వేసిన పోటు మాటేమిటో? రాష్ట్రంలో సహజ వనరుల లూటితో సంపాదించిన సొమ్ము దోచుకున్నదెవరో? దాచుకున్నదెవరో? హత్య ఆరోపణలు ఎదుర్కుంటున్న నేతలకు అండగా ఉండడమేనా విలువలు విశ్వసనీయత అంటే? బెయిలే కవచంగా కేంద్ర పెద్దల ఆశీస్సులే బలంగా ముందుకెళ్తున్న జగన్ ఈ రాష్ట్రానికి అవసరమా? అంటూ జగన్ ప్రసంగానికి ప్రతి విమర్శలు మొదలైనాయి.

వై ఏపీ నీడ్స్ జగన్? అనే నినాదంతో పార్టీ నేతలు ప్రజలలోకి వెళ్లాలంటూ జగన్ ఇచ్చిన పిలుపుకు సామాజిక మాధ్యమాలలో నెటిజన్లు పలు ప్రశ్నలను లేవనెత్తుతున్నారు. అందులో ఉదాహరణగా కొన్ని…రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినందుకా? పోలవరం పూర్తి చేయనందుకా? రాజధాని నిర్మాణం చెప్పటనందుకా? ప్రత్యేక హోదా సాధించనందుకా? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు అంగీకరించినందుకా?

కౌలు రైతులకు రైతుబందు పధకం అమలుకానందుకా? రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నేతల మీద అక్రమ కేసులు మోపి కక్ష పూరిత రాజకీయాలకు పాల్పడినందుకా? రాష్ట్రం నుంచి పెట్టుబడులు తరలిపోయినందుకా? రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు పెంచినందుకా? ప్రజల జీవన ప్రమాణాలను తగ్గించినందుకా? వై ఏపీ నీడ్స్ జగన్ అంటూ జగన్ కేసుల లిస్ట్ మాదిరి ప్రశ్నల పొద్దు పెరుగుతూ పోతుంది.

రాష్ట్రానికి జగన్ కాదు, జగన్ కే రాష్ట్రం కావాలి, ఎందుకంటే జగన్ ఆదాయ దాహానికి అధికార దాహమే సరైన మార్గం కాబట్టి. ఇప్పటికే ఇసుక మాఫియా, కొండలకు గుండు గొట్టే కార్యక్రమాలతో రాష్ట్ర సహజ సంపదను దోచేస్తున్న జగన్ ఇక రానున్న రోజులలో జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని ఎడారి మాదిరి చేయడం ఖాయం అనేవారు సంఖ్య నానాటికి పెరిగిపోతుంది.

వైసీపీ కార్యకర్తలతోనే రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా వాలంటీర్ వ్యవస్థను సృష్టించి అడుగడుగునా ప్రజల కదలికల పై నిఘా ఏర్పాటు చేసి మొత్తం రాష్ట్రాన్ని తన కనుసన్నలలో ఉంచుకోవడానికేనా? జగన్ కు ముఖ్యమంత్రి పదవి. ప్రజలు సొమ్ముతో ఇచ్చే పథకాలకు, ఏర్పాటు చేసే విద్యా సంస్థలకు తన పేరు, తన తండ్రి పేరు పెట్టుకోవడానికేనా? జగన్ కు ముఖ్యమంత్రి పదవి. మంత్రులతో విపక్ష పార్టీ నేతలను బూతులు తిట్టించడానికేనా? అధికారం కోసం జగన్ ఆరాటం.

ADVERTISEMENT
Latest Stories