ప్రతిపక్షనేత జగన్ చిత్తూరు జిల్లాలో తన ప్రజా సంకల్ప పాదయాత్రలో శ్రీ వెంకటేశ్వరుని సెంటిమెంటును ప్రస్తావించారు. ముఖ్యమంత్రి పదవి కోసం సాక్షాత్తు వేంకటేశ్వర స్వామి సన్నిధిలో నిలబడి 15 ఏళ్లు ప్రత్యేక హోదా తెస్తానన్న మాటను చంద్రబాబు నాయుడు విస్మరించారని ఆయన అన్నారు.
“కాస్తోకూస్తో ఉద్యోగాలు రావాలంటే ప్రత్యేక హోదాతోనే సాధ్యం. ఇవాళ డిగ్రీ అయిపోతే పిల్లొడు ఎక్కడికి వెళ్లాలో అర్థం కాని పరిస్థితి. ఉద్యోగాల కోసం చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్తున్నారు. ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు పెట్టే వారికి రాయితీలు వస్తాయి. ఈ విషయం చంద్రబాబుకు బాగా తెలుసు,” అని జగన్ అన్నారు.
నిజమే చంద్రబాబు వెంకన్న స్వామి పాదాల చెంత 15 ఏళ్ల పాటు స్పెషల్ స్టేటస్ కావాలని డిమాండ్ చేసారు. అయితే అదే సభలో అదే మాట ఇచ్చిన మోడీ మాట తప్పారు. మరి ఆయనను ప్రశ్నించే దమ్ము జగన్ కు ఎందుకు లేదు? నిజానికి స్పెషల్ స్టేటస్ అనేది చంద్రబాబు ఇచ్చేది కాదు. దీనికి ఆయనను నిందించి అసలు వారిని వదిలేయ్యడంలో లోగుట్టు ఏంటి?
రాష్ట్రానికి ఇచ్చిన మాట తప్పిన మోడీ దగ్గరకి తన అంతరంగీకుడు విజయ సాయి రెడ్డిని పంపి వైకుంఠ ఏకాదశి విషెస్ చెప్పించడం ఏంటి? మాట తప్పిన బీజేపీ హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ లో గెలిచినందుకు ఢిల్లీ వెళ్లి మరి ప్రధానికి పుష్పగుచ్ఛాలు ఇవ్వడం ఏంటి? స్పెషల్ స్టేటస్ కోసం ఎంపీల రాజీనామాలు ఏమాయినట్టు? గురివింద గింజకు తన నలుపు తనకు తెలియదు అన్నట్టు లేదా ఇది?



