
గ్లామర్ ఫీల్డ్ లో రాణించడం అంటే అది వంద కి వంద శాతం సక్సెస్ సాధించడం అంటే అంత ఈజీ కాదు. అది ఇప్పటి వరకు ఒక్క రాజమౌళికి మాత్రమే సాధ్యం అనుకున్న వారికీ ఆ వరుసలో నేను కూడా ఉన్నాను అంటూ ఈ సంక్రాంతికి వచ్చారు దర్శకుడు అనిల్ రావిపూడి.
దర్శకుడిగా ‘పటాస్’ తో మొదలైన అనిల్ సినీ జీవితం ‘సంక్రాంతికి వస్తున్నాం’ వరకు నిర్విరామంగా కొనసాగుతూ అపజయం అన్న మాటే వినిపించకుండా సాగించారు. అనిల్ రావిపూడి సినిమా అంటే హిట్టే గా హిట్టేగా అన్నటుగా ఆయన తనదైన పంథాలో కామెడీ ట్రాక్ లో ముందుకెళ్తున్నారు.
Also Read – సజ్జల లేని లోటు కనిపిస్తోందా.. మావయ్యా?
2015 లో వచ్చిన పటాస్ మూవీ హీరో కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే ది బెస్ట్ మూవీ గా నిలిచింది. ఈ మూవీలో పోలీస్ ఆఫీసర్ గా కళ్యాణ్ రామ్ ను రెండు యాంగిల్స్ లో చూపిస్తూ అటు యాక్షన్ తో పాటుగా ఇటు కామెడీ కి కూడా పెద్ద పీట వేసి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నారు అనిల్.
ఇక ఆ తరువాత వచ్చిన సాయి తేజ్..సుప్రీం, రవితేజ..రాజా ది గ్రేట్, వెంకీ, వరుణ్ తేజ్ ల F2 ,F3 , మహేష్..సరిలేరు నీకెవ్వరూ, బాలకృష్ణ..భగవత్ కేసరి, వెంకీ..సంక్రాంతికి వస్తున్నాం…ఇలా అనిల్ దర్శకత్వం నుండి బయటకొచ్చిన అన్ని సినిమాలు కూడా ఫ్యామిలీ ఎంటెర్టైనెర్స్ గా అటు ధియేటర్లలోనూ, ఇటు ఓటిటీలలోను ప్రేక్షకులను అలరిస్తున్నాయి.
Also Read – జగన్ 2.0 కోసం కార్యకర్తలు జైళ్ళకి వెళ్ళాలా?
తన పదేళ్ల సినీ కెరీర్ లో మొత్తం అనిల్ ఎనిమిది సినిమాలకు గాను దర్శకత్వం వహించగా వాటిలో అన్ని సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద విజయాలను అందుకున్నాయి. దీనితో రాజమౌళి తరువాత 100 % స్ట్రైక్ రేట్ ఉన్న సాధించిన మరో తెలుగు దర్శకుడిగా అనిల్ రికార్డు నెలకొల్పారు.
అయితే సరిగ్గా ఇదే ఘనతకు ఒక్క అపజయం దూరంలో ఆగిపోయారు కొరటాల శివ. శివ తెరకెక్కించిన మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్,భరత్ అనే నేను, దేవర ఇలా తీసిన ఆరు సినిమాలలో మెగా స్టార్ తో రూపొందిన ఒక్క ఆచార్య తప్ప అన్ని కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాలనే అందుకున్నాయి. ఆచార్య డిజాస్టర్ తో కొరటాల విజయపరంపరకు ‘మెగా’ స్టార్ బ్రేక్ వేసినప్పటికీ దేవర తో తిరిగి ఫామ్ లోకి వచ్చారు శివ.
Also Read – జగన్ మొదలెట్టేశారు.. విజయసాయి రెడీయా?
అయితే అనిల్ తన తదుపరి చిత్రాన్ని మెగా స్టార్ చిరంజీవితో అంటూ ప్రకటించడంతో ఇప్పటి వరకు ఉన్న అనిల్ రావి పూడి వరుస విజయాల పరంపరను మెగా స్టార్ చిరంజీవితో కూడా కొనసాగించగలుగుతారా.? లేక కొరటాల శివ మాదిరి మెగా స్టార్ సెంటిమెంట్ ముందు తలవంచి అనిల్ కూడా తన విజయాలకు బ్రేక్ వేసుకుంటారా.? అనేది వేచి చూడాలి.