
ఒకప్పటి వెండితెర వెలుగులు ఆస్వాధించిన లీడ్ యాక్ట్రెస్స్ స్వయంవరం..లయ, పందెం కోడి..మీరా జాస్మిన్, మన్మధుడు అన్షు గత కొన్నేళ్లుగా ఆ వెండితెరకు దూరంగా ఉంటున్నారు. అయితే ఇప్పుడు వారు టాలీవుడ్ లో తమ సెకండ్ ఇనింగ్స్ షురూ చేస్తున్నారు.
అందులో భాగంగా ఇప్పటికే మీరాజాస్మిన్, శ్రీ విష్ణు ‘స్వాగ్’ మూవీ లో నటించి తన టాలీవుడ్ కం బ్యాక్ స్టార్ట్ చేసారు. పందెం కోడి అంటూ తమిళ డబ్బింగ్ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ అమ్మడు టాలీవుడ్ లో మంచి అవకాశాలనే అందుకున్నారు. అలాగే రవితేజ భద్ర మూవీ తో మంచి హిట్ అందుకుని ఫ్యామిలి ఆడియన్స్ మనసు గెలుచుకున్నారు మీరా.
Also Read – చెప్పేవి శ్రీరంగ నీతులు…చేసేవి వైసీపీ రాజకీయాలా.?
పవన్, గుడుంబా శంకర్, అమ్మాయి బాగుంది, గోరింటాకు ఇలా వరుస అవకాశాలతో దూసుకుపోయిన మీరా సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. అయితే ఇప్పుడు ‘విమానం’ మూవీ తో తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన మీరా జాస్మిన్ స్వాగ్ తో దాన్ని కొనసాగించారు. ఇక మన్మధుడు ఫేమ్ అన్షు కూడా తన మొదటి సినిమాతోనే ప్రేక్షకుల మనసు దోచినప్పటికీ ఒకటి రెండు సినిమాలతోనే తన సినీ కెరియర్ కు ఫుల్ స్టాప్ పెట్టారు.
అనూహ్యంగా ఇప్పుడు రెండు దశాబ్దాల గ్యాప్ తరువాత మళ్ళీ వెండితెర మీద తన అదృష్టం పరీక్షించుకోవడానికి ‘మజాకా’ మూవీ తో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ‘నటిస్తేనే కదా తెలిసేది నచ్చుతుందో లేదో’ అంటూ అన్షు రీ ఎంట్రీ మీద సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపించారు నెటిజన్లు.
Also Read – రఘురామని కూడా బాబు కాపాడుకున్నారు.. మరి వంశీని?
ఇక బెజవాడ తెలుగమ్మాయిగా తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన లయ తన మొదటి సినిమా స్వయంవరంతో మంచి హిట్ అందుకున్నారు. అలాగే ప్రేమించు, మనోహరం, నీ ప్రేమకై, మిస్సమ్మ వంటి హిట్ సినిమాలలో నటించినప్పటికీ పెళ్లి తో తన సినీ కెరీర్ కు లాంగ్ గ్యాప్ ఇచ్చారు. మళ్ళీ ఇన్నేళ్ల తరువాత నితిన్ ‘తమ్ముడు’ మూవీ తో తన రీ ఎంట్రీ ప్లాన్ చేసుకున్నారు లయ.
మరి ఈ ముగ్గురు నటీమణులు కూడా తమ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా అదే మెరుపులు మెరింపించగలరా.? అదే స్థాయి అవకాశాలు దక్కించుకోగలరా అనేది రానున్న కాలంలో తెలియనుంది. అయితే సరిలేరు నీకెవ్వరూ అంటూ మాజీ హీరోయిన్స్ ‘సంగీత’, మిర్చి మూవీ తో ‘నదియా’ తమ సెకండ్ ఇన్నింగ్స్ ను కూడా విజయాలతో ఆరంభించి వరుస అవకాశాలను దక్కించుకుంటున్నారు. మరి వీరు కూడా అదే బాటలో రాణిస్తారా.? ప్రేక్షకులను మెప్పిస్తారా.?