కాంగ్రెస్ ‘గ్రహణం’ వీడనుందా..?

YS Sharmila

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గ్రామా స్థాయి నాయకుడు నుండి కార్యకర్త వరకు వేళ్ళు ఊరుకుని ఉన్న కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఒక్కసారిగా తిరగబడిందనే చెప్పాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను తెలంగాణ, ఆంధ్రాగా విభజించిన కాంగ్రెస్ రాష్ట్ర విభజనతోనే ఆంధ్రాలో తన పార్టీకి తానే సమాధి కట్టుకుంది. పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్న నాయకుడు కానీ ఆ నాయకుడి వెంట నడిచే కార్యకర్త కానీ ఆంధ్రాలో కనిపించలేదు అంటే అది అతిశయోక్తి కాదు.

వచ్చిన అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకుని కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ను, నాయకత్వాన్ని తన వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ కిందకు చేర్చుకోవడంలో విజయం సాధించగలిగారు జగన్మోహన్ రెడ్డి. అన్న వ్యూహాలకు చెల్లెలు సహకారం తోడవడంతో కాంగ్రెస్ ఓటు బ్యాంకు మొత్తాన్ని తానూ సొంత చేసుకోగలిగారు జగన్. అయితే ఇప్పుడు అదే అన్నకు వ్యతిరేకంగా అదే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా తన పుట్టిల్లైనా ఆంధ్రప్రదేశ్ కడప గడపలో అడుగుపెట్టారు షర్మిల.

ADVERTISEMENT

తన తండ్రి వైస్సార్ ఆశయ సాధనకు, తన తండ్రి చివరి కోరికైనా రాహుల్ ను ప్రధానిని చేయడానికి వైస్సార్ వారసురాలిగా, కాంగ్రెస్ నాయకురాలుగా అడుగు ముందుకేసి షర్మిల తన మొదటి అడుగుతోనే అన్న వెన్నులో వణుకు పుట్టించగలిగారు. అలాగే సమాధిలో ఉన్న కాంగ్రెస్ పార్టీని బయటకు తీసి నాయకులలో ధైర్యాన్ని, కార్యకర్తలలో ఆత్మ స్తైర్యాన్ని నింపుతున్నారు షర్మిల.

ఒక్కటిగా నిలబడి తానే రాజు తానే సైనికుడు అనేలా ప్రభుత్వం పైన ముఖ్యంగా చెప్పాలంటే తన అన్న జగన్ మీద యుద్ధమే చేస్తున్నారు షర్మిల. ఈ యుద్ధంలో భాగంగా అవినాష్ రెడ్డికి ప్రత్యర్థిగా కడప ఎంపీ గా బరిలో దిగారు షర్మిల. షర్మిల పోరాటానికి వైస్ వివేకా కుటుంబం నుండి మద్దతు లభించడంతో అవినాష్ మొదలుకుని అన్న జగన్, వదిన భారతి మీద కూడా అలుపెరుగని పోరాటం చేస్తున్నారు షర్మిల.

ఆడబిడ్డగా తాను చూపిస్తున్న తెగువ తెగింపు చూసి ప్రత్యర్థులు సైతం షర్మిల గెలుపు కోసం ఆశపడుతున్నారు. అయితే ఇన్నాళ్లుగా మోనంగా చీకటిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు ఒక్కసారిగా గ్రహణం విడిచిన సూర్యుడిలా వెలుగులోకి వచ్చారు. ఈసారి వైసీపీ ఓటమి కాంక్షించి టీడీపీ, జనసేన,బీజేపీ కూటమిగా బరిలోకి దిగుతున్న సందర్భంలో కాంగ్రెస్ తన ఉనికి కోసం ప్రయత్నిస్తుంది. వైసీపీ చేతికి చిక్కిన కాంగ్రెస్ ఓటు బ్యాంకు ను తిరిగి రాబట్టుకునే పనిలో పడ్డ కాంగ్రెస్ అందుకు అనుగుణంగా తన తొలి అడుగు వేసింది.

ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్ పదేళ్ల తరువాత తన మొదటి ఖాతా తెరవనుంది అంటూ సర్వేల ఫలితాలతో తేటతెల్లమవుతుంది. 2024 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయంగా కనపడుతుంది. అధికారంలో ఉండగా వైసీపీ నేతలు వేసిన వెర్రి వేషాలకు, చేసిన దిగజారుడు విమర్శలకు ఆ నేతలు టీడీపీ, జనసేన వైపు చూసే అవకాశం లేదు. కాబట్టి తిరిగి వారంతా తన సొంతింటికి చేరే అవకాశమే ఎక్కువగా ఉంది.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ను వైస్సార్ కాంగ్రెస్ గా రూపాంతరం చేసిన జగన్ కు వైస్సార్ కాంగ్రెస్ ను తిరిగి కాంగ్రెస్ గా మార్చి షర్మిల అన్న, వదినకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం ఖాయం అంటూ ప్రచారం జరుగుతుంది. 2029 ఆంధ్రప్రదేశ్లో జరగబోయే ఎన్నికలలో కాంగ్రెస్ ప్రతిపక్ష పాత్ర పోషించడంలో ఎటువంటి సందేహం లేదనేది పొలిటికల్ సర్కిల్స్ లో వినపడుతున్న మాట. మరి కాంగ్రెస్ తన తొలి అడుగుతో వామనుడిగా మారి వైసీపీ ని భూస్థాపితం చేయనుందా..?

ADVERTISEMENT
Latest Stories