కొడాలి విషయంలో లోకేష్ మాట నిలబెట్టుకుంటారా.?

Kodali Nani Arrest

వైసీపీ 151 నుంచి 11 కి పతనం అవ్వడంతో గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ప్రెస్ మీట్లు కూడా ఒక కారణం అనేది జగమెరిగిన సత్యమే. నాటి వైసీపీ ప్రభుత్వ హయాంలో మంత్రిగా మీడియా ముందుకొస్తే చాలు బాబు, లోకేష్ పై విచక్షణ మరిచి బూతులతో విరుచుకుపడడం నాని దినచర్యలో భాగమయ్యింది.

దానితో టీడీపీ క్యాడర్ కే కాదు సామాన్య ఓటర్ కి సైతం వైసీపీ మీద అసహ్యం, కొడాలి మీద ఆక్రోశం పెరిగిపోయాయి. కూటమి అధికారంలోకి వచ్చాకా లోకేష్ యువగళం పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం కొడాలి అరెస్టు ఖాయం అని అందరు భావించారు.

ADVERTISEMENT

కానీ 2024 వైసీపీ ఓటమితో బూతులకు కాస్త విరామం ఇచ్చిన కొడాలి రాజకీయ అజ్ఞాతం లోకి వెళ్లారు. అనారోగ్య సమస్యలతో కొన్నాళ్ళు, ప్రజలు తమ పదవి పీకేశారు అనే కుంటీ సాకులు చెప్పుకుంటూ మరికొన్నాళ్లు రాష్ట్ర ప్రజలకే కాదు కనీసం వైసీపీ క్యాడర్ కి, మీడియాకు కూడా ముఖం చాటేశారు.

దీనితో టీడీపీ, కొడాలిని మరచిపోయిందా.? కూటమి ప్రభుత్వం కొడాలి పై చర్యలు తీసుకోదా అన్న సందేహాలు మొదలయ్యాయి. ఇక అందుకు తగ్గట్టే కొడాలి నాని కూడా ఎక్కడా గతంలో మాదిరి వైసీపీ బ్రాండ్ బూతులతో రెచ్చిపోవడం లేదు.

బాబు, లోకేష్ పై విమర్శలకు దిగడం లేదు, ఒకవేళ దిగినా పరిధి దాటి ముందుకెళ్ళడంలేదు. ఈ నేపథ్యంలో కొడాలి గత అరాచకాలన్నీ ముగిసిన అధ్యాయాలేనా.? అంటూ టీడీపీ శ్రేణులు సైతం నిరాశ పడుతున్నారు. ఇదిలా ఉంటె నేడు తాడేపల్లి ప్యాలస్ జగన్ మీటింగ్ కు హాజరయిన కొడాలి మీడియా ముందుకొచ్చారు.

ఇక పనిలో పనిగా బాబు, లోకేష్ పై విమర్శలు మొదలుపెట్టారు. అయితే ఆ విమర్శల స్థాయి కూడా పరిధి దాటకుండా జాగ్రత్త పడ్డారు కొడాలి. కొడాలి ఇలానే బయటకొచ్చి తన అసలు రూపాన్ని బయటకు తేవాలని, అప్పుడైనా కొడాలి గత పాపాల చిట్టా మరోసారి చర్చకు వస్తుందని టీడీపీ క్యాడర్ ఎదురుచూస్తున్నారు.

మరి వారి ఆశలను నెరవేర్చే దిశగా లోకేష్ అడుగులు వేస్తారా.? పార్టీ శ్రేణులకిచ్చిన మాట నిలబెట్టుకుంటారా.? కొడాలి నాని మాదిరి బూతు రాజకీయాలు చేసే వారికీ అధికారం దూరమైతే పరిస్థితులు ఎలా మారతాయి అనేదాన్ని అనుభవ పూర్వకంగా రుచి చూపిస్తారా.? అనేది కాలమే బదులు చెప్పాలి.

ADVERTISEMENT
Latest Stories