ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సడన్ గా ఈనాడు అధినేత రామోజీరావుని కలిసారు. పార్టీ అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డితో కలసి జగన్ రామోజీరావు ఇంటికి వెళ్లారు. వారిద్దరు 40 నిమిషాల పాటు ఏకాంత చర్చలు జరిపారు అని సమాచారం.
పాదయాత్రకు సంబంధించి కవరేజీతోపాటు… పార్టీ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని జగన్ కోరినట్లు తెలుస్తోంది. జగన్ తండ్రి వైఎస్ఆర్ పాదయాత్ర చేసినప్పుడు ఈనాడు ఆయనకు విశేషమైన కవరేజ్ ఇచ్చింది. మెయిన్ పేజ్ లో రాజశేఖర రెడ్డి పాదయాత్ర ఫోటోలను ఆయన పాదయాత్ర చేసినంత కాలం ప్రచురించేది.
ఐతే పదవి వచ్చాక వైఎస్ రామోజీరావు తో ఎక్కడ చెడిందో తెలీదుగాని ఆయన ఆర్ధిక సామ్రాజ్యంపై దెబ్బ కొట్టే ప్రయత్నం చేశారు. ఉండవల్లి అరుణ్ కుమార్ తో అనేక కేసులు వేయించారు. రామోజీ రావు అటు తరువాత వైఎస్ అండ్ జగన్ చేసిన లక్ష కోట్ల అవినీతిని బయటకి తెచ్చారు.
తన తండ్రికి సహకరించిన్నట్టే తనకు పాదయాత్ర టైమ్లో సహకరించారాలని జగన్ ఆయనను కోరారు. ఐతే రామోజీరావు వైఎస్ పాదయాత్రకు సహకరించడం చారిత్రాత్మక తప్పిదం అని చాలా సార్లు తన కోటరీ వాళ్ళతో అన్నట్టు సమాచారం. ఇప్పుడు జగన్ కు సహకరిస్తే మళ్లీ తప్పు చేసినట్టే అని ఆయనకు కొంతమంది సలహా ఇస్తున్నారట.
ఐతే దీనిపై రామోజీరావు ఏం డిసైడ్ చేస్తారో వేచిచూడాలి. రామోజీని జగన్ వ్యక్తిగతంగా కలవడం ఇది రెండోసారి! 2015 సెప్టెంబరు 24న రామోజీ ఫిలింసిటీకి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. అప్పట్లో ప్రత్యేక హోదాకోసం గుంటూరులో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు సరిగ్గా రెండు రోజుల ముందు ఈ భేటీ జరిగింది
ఐతే రామోజీరావు ఆ దీక్షకు పెద్దగా సహకరించింది ఏమీ లేదు. ఈసారి ఏం చేస్తారో చూడాలి మరి. నవంబర్ 6 నుండి 6 నెలల పాటు 3600 కిలోమీటర్ల దూరం నడవాలని ఆయన ప్రణాళిక. ఈ ప్రక్రియలో ఆయన 120 నియోజకవర్గాలను కవర్ చెయ్యబోతున్నారు. ఈ పాదయాత్ర ఆయనను ముఖ్యమంత్రి సింహాసనంలో కూర్చోబెడుతుందని జగన్ నమ్మకం.