జగన్ చేసిన తప్పునే మళ్ళి చేస్తారా?

Will YS Jagan do the same mistakeఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాలం సమావేశాలకు వైకాపా డుమ్మా కొట్టింది. ఫిరాయింపులకు వ్యతిరేకంగా బహిష్కరించాం అని చెప్పుకున్నా, జగన్ పాదయాత్రలో ఉండటం వల్ల వేరే ఎమ్మెల్యేలతో సభను నడిపించడం ఇష్టం లేక ఏకంగా డుమ్మా కొట్టేసారు. దాని మీద అప్పట్లో చాలా విమర్శలు ఎదురయ్యాయి.

ADVERTISEMENT

ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. దాదాపుగా ఇంకో 5-6 నెలలపాటు జగన్ పాదయాత్ర సాగబోతుంది. దీనితో చాలా ముఖమైన బడ్జెట్ సమావేశాలకైనా ప్రతిపక్షనేత హాజరవుతారో లేదో చూడాలి. బడ్జెట్ ను కూడా బహిష్కరిస్తే ఈసారి చాలా విమర్శలు ఎదురుకోవాల్సి ఉంటుంది.

మరోవైపు ఇప్పటికే జగన్ పాదయాత్ర ఇప్పటికే 1000 కిలోమీటర్ల దూరం దాటింది. నెల్లూరు జిల్లాలో సైదాపురం మండలం తలుపూరు నుంచి 76వ రోజు పాదయాత్రను వైఎస్‌ జగన్‌ మొదలుపెట్టారు. తన దివంగత తండ్రి మాదిరిగా ఈ పాదయాత్రతో అధికారంలోకి రావాలని జగన్ ఆరాటపడుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories