తిరుమల శ్రీవారితో పరాచికాలు ఎందుకు మావా?

YCP Controversy Over Tirumala Temple Continues

తిరుమల వెంకన్నతో ఏ రాజకీయ నాయకుడు పరాచికాలు ఆడినా భారీ మూల్యం చెల్లించక తప్పదని పదేపదే నిరూపితమవుతూనే ఉంది.

జగన్‌ హయంలో శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వాడటం మొదలు అనేక అపచారాలు జరిగాయి. అందుకు స్వామివారు జగన్‌కి రెండు నామాలు (11) ప్రసాదించారు.

ADVERTISEMENT

కనుక ఇకనైనా తిరుమల శ్రీవారితో రాజకీయాలు చేయకుండా దూరంగా ఉంటారనుకుంటే, నేటికీ వైసీపీ నేతలు రాజకీయాలు చేస్తూనే ఉన్నారు.

టిటిడీ మాజీ చైర్మన్‌గా చేసిన కరుణాకర్ రెడ్డి స్వామివారి గోశాలలో ఆవులు చనిపోతున్నాయంటూ చేసిన రాజకీయాలు అందరికీ గుర్తుండే ఉంటాయి. ఇక వైసీపీ ఫేక్ ఫోటోలు, వీడియోలు సృష్టింఛి సోషల్ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తూనే ఉంది.

ఇందుకు తాజా ఉదాహరణగా తిరుపతి పట్టణంలో ట్రాఫిక్ బ్యారికేడ్ల గురించి చెప్పుకోవచ్చు. ఓ స్థానిక హోటల్ వాణిజ్య ప్రకటన వాటిపై ఉంది. తమ హోటల్లో రుచికరమైన మాంసాహారం లభిస్తుందని తెలియజేస్తూ చికెన్ బిర్యానీ ఫోటో ముద్రించి ఉంది.

ఆ బ్యారికేడ్లు పట్టణంలో చంద్రగిరికి వెళ్ళేదారిలో ఉండగా అవి తిరుమల కొండపై ఉన్నట్లు చూపుతూ, పవిత్రమైన తిరుమల కొండపై మాంసాహారమా? అంటూ సోషల్ మీడియాలో నేడు ఓ పోస్ట్ ప్రత్యక్షమైంది.

ఇది టిటిడీ దృష్టికి రావడంతో వెంటనే స్పందిస్తూ ఇవి తిరుమల కొండపై ఉన్న బ్యారేకేడ్లు కావని, కిందన పట్టణంలో చంద్రగిరికి వెళ్ళే దారిలో ఉన్నాయని తెలియజేసింది. ఈవిదంగా తిరుమల పవిత్రతకు భంగం కలిగించేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని టిటిడీ హెచ్చరించింది.

ఇటీవలే టిటిడీ చైర్మన్ బిఆర్ నాయుడు స్పందిస్తూ, “వైసీపీ నేతలు తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఎందుకు టార్గెట్ చేసుకుంటున్నారు?పనిగట్టుకొని టిటిడీపై ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు? అసలు టిటిడీ ప్రతిష్టకు ఎందుకు భంగం కలిగించాలనుకుంటున్నారు?మీకు జరిగిన శాస్తి సరిపోలేదా?” అంటూ సూటిగా ప్రశ్నించారు.

కానీ టిటిడీ విషయంలో వైసీపీ మాత్రం తగ్గేదేలే అన్నట్లు వ్యవహరిస్తోంది. కనుక ఆ ఏడుకొండల వెంకన్నే వాళ్ళ సంగతి చూసుకోవాలి.

ADVERTISEMENT
Latest Stories