తమ పార్టీ ఎమ్.పిలు చిత్తశుద్దితో రాజీనామాలు చేస్తే, స్పీకర్ రాజీనామాలు ఆమోదించకపోవడంపై తమపై చంద్రబాబు అన్యాయంగా ఆరోపణలు చేస్తున్నారని జగన్ అన్నారు.ఇంతకు ముందు ముగ్గురు ఎమ్.పిలు తమ పార్టీ నుంచి చంద్రబాబు లాక్కున్నారని, వారిపై అనర్హత వేటు వేయాలని తాము కోరినా, స్పీకర్ వ్యవస్థను మేనేజ్ చేసి అది జరగకుండా చేసింది చంద్రబాబు కాదా అని జగన్ ప్రశ్నించారు.
29 సార్లు ఢిల్లీ వెళ్లినా పనులు అవ్వని, ఎన్డీఏలో ఉన్న అపాయింట్మెంట్ ఇవ్వని ప్రధాని చంద్రబాబు మేనేజ్ చెయ్యగలిగారా? ఇలాంటి మోసాలు చేయడం చంద్రబాబుకు అలవాటు అయిపోయిందనిపైగా ఎదుటివారిమీద బురద వేస్తారని ఆయన అన్నారు.వైఎస్ ఆర్ కాంగ్రెస ఎమ్.పిలతో పాటు టిడిపి ఎమ్.పిలు కూడా రాజీనామా చేసి ఉంటే అన్నిటిని కలిపి ఆమోదించే పరిస్థితి వచ్చేది కదా అని జగన్ అన్నారు.
అసలు వైకాపా ఎంపీలు ఒకరే రాజీనామా చేస్తే ఆమోదించకపోవడం ఏంటో? అందరు చేస్తే ఆమోదిస్తారు అనడం ఏంటో? జగన్ కే తెలియాలి. జూన్ 6 తరువాత వైకాపా ఎంపీల రాజీనామాలు ఆమోదించే అవకాశం కనిపిస్తుంది. అప్పటికి పార్లిమెంట్ మొదటి సారి కూర్చుని నాలుగేళ్ళు పూర్తి అవ్వడంతో, ఒక ఏడాది మాత్రం ఎన్నికలకు సమయం ఉండటంతో ఉపఎన్నికలు వచ్చే అవకాశం లేదు.



