జగన్ పెద్ద మోసగాడు… జనసేన మొదటి అభ్యర్థి

YS jagan Cheated me -Pithani -Balakrishnaజనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ పార్టీ నుండి మొదటి అభ్యర్థిని ప్రకటించారు. తూర్పు గోదావరి జిల్లాలోని ముమిడివరం నియోజకవర్గం నుండి పితాని బాలకృష్ణను పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. గతంలో ఆయన అదే నియోజకవర్గానికి వైకాపా ఇంచార్జ్ గా పని చేసి గత నెలలో జనసేన పార్టీలోకి మారారు.

[m9ad]

ADVERTISEMENT

“నాకు టికెట్టు ఇస్తానని చెప్పి నా ఉద్యోగానికి రాజీనామా చేయించి,చివరికి ఇప్పుడు వేరే వాళ్లకి ఇస్తా అని చెప్పి మొసం చేశాడు ఆయన, జగన్ ను నమ్మకండి. ఆయన పెద్ద మొసగాడు,” అని ఈ సందర్భంగా బాలకృష్ణ అన్నారు. గతంలో తన దగ్గర డబ్బు లేదని సర్వేలో తేలిందని అందుకే టిక్కెట్టు ఇవ్వలేను అని జగన్ చెప్పినట్టుగా బాలకృష్ణ ఆరోపించారు.

అయితే పవన్ కళ్యాణ్ ఇప్పటికి తాను ఎక్కడ నుండి పోటీ చేస్తారో అనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. పితాని బాలకృష్ణ శెట్టి బలిజ కులానికి చెందిన నాయకుడు కోనసీమలో ఆ కులానికి సంబంధించిన ప్రజలు ఎక్కువగా ఉండటంతో వారిని పార్టీ వైపు ఆకట్టుకునే ప్రయత్నంగా కనిపిస్తుంది.

ADVERTISEMENT
Latest Stories