వందల కోట్లు పోసి ప్రశాంత్ కిషోర్ ను తెచ్చుకుని ఉపయోగం ఏంటి?

prashant kishor jaganప్రతిపక్షనేత జగన్ మోహన్ రెడ్డి ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రత్యేక హోదా వస్తే ఆదాయపు పన్ను కట్టాల్సిన పని లేదని చెప్పుకొచ్చారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అసలు ప్రత్యేక హోదా అంటే తెలీకుండానే అది సంజీవిని అని, దానికోసం పోరాటం చేస్తామని అంటున్నారా అని అంతా ఎద్దేవా చేశారు.

ADVERTISEMENT

అయితే జగన్ నిన్న జరిగిన ఒక బహిరంగ సభలో మళ్ళీ అదే పాట పాడారు. ప్రత్యేక హోదా వస్తే ఆదాయపు పన్ను కట్టాల్సిన పని లేదని మరోసారి చెప్పుకొచ్చారు. ఆయనకు తెలీదు సరే అంత కాంట్రవర్సీ అయ్యాక కనీసం ఆయన చుట్టూ ఉండే వాళ్ళైనా ఆయనకు ఆ విషయం చెప్పి కరెక్టు చెయ్యాలి కదా?

అటువంటి వాటికోసమే కదా వందల కోట్లు పోసి ప్రశాంత్ కిషోర్ ను తెచ్చుకుంది. మరి ఆయన ఏం చేస్తున్నట్టు? ఇటు వంటి వ్యాఖ్యలు ప్రత్యేక హోదా అంటూ జాతీయ మీడియాలో చేస్తే అభాసుపాలు అవ్వరా? ఆయన సంగతి సరే మొత్తం రాష్ట్ర పోరాటంని కూడా హాస్యాస్పదం చేసేలా ఉన్నారు.

ADVERTISEMENT
Latest Stories