విశాఖ ఎయిర్ పోర్ట్ లో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై దాడి జరగడం, అది రాజకీయంగా ఎంత ప్రకంపనలు సృష్టించిందో తెలిసిందే. ఫైనల్ గా… అది బిజెపి అండ్ వైసీపీ మెడకు చుట్టుకోవడంతో టిడిపి వర్గాలు నింపాదిగా ఉన్నాయి. రాజకీయంగా పరిస్థితి ఇలా ఉంటే, ఈ ఉదంతం జరిగిన తర్వాత అక్కినేని కాంపౌండ్ హీరో సుమంత్ పై ఒత్తిడి పెరిగినట్లుగా కనపడుతోంది.
[m9ad]
ట్విట్టర్ లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు జవాబులిచ్చిన సుమంత్ కు, “జగన్ గాయపడిన ఫోటోలను, కత్తి దిగిన ఫోటోలను పోస్ట్ లు చేస్తూ స్పందించాల్సిందిగా’ నెటిజన్లు ఒత్తిడి చేస్తున్నారు. తన తదుపరి చిత్రాలు “ఇదం జగత్, సుబ్రహ్మణ్యపురం”లు నవంబర్, డిసెంబర్ లలో విడుదల అవుతాయంటూ చెప్పిన సుమంత్ కు జగన్ ఫోటోలు రిప్లైలుగా దర్శనమిచ్చాయి.
వైఎస్ జగన్ మరియు సుమంత్ లు క్లాస్ మేట్స్ కావడమే ఈ హీరోపై అభిమానుల ఒత్తిడికి ప్రధాన కారణం. అయితే ఎన్ని రకాలుగా వైసీపీ అభిమానులు సుమంత్ ను స్పందించాల్సిందిగా కోరినప్పటికీ, సుమంత్ మాత్రం ‘మౌనం’ వహించారు. దీంతో నెటిజన్లు కూడా సదరు ట్వీట్లను డిలీట్ చేసేసారు. చివరగా “ఎన్టీఆర్ బయోపిక్”లో కూడా చేస్తున్నానని, గౌరవప్రదమైన ఈ సినిమాతో జనవరి 2019లో మీ ముందుకు వస్తానంటూ సుమంత్ స్పష్టం చేసారు.



