జగన్ ఎమన్నా తన సొంత ఆస్తులు తెచ్చి పంచి పెడతారా?

YS Jagan fees reimbursement జగన్ స్పీక్స్ సిరీస్ లో భాగంగా వైఎస్సాఆర్ కాంగ్రెస్ మరో వీడియో విడుదల చేసింది. విపక్ష నేత , వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ ఈసారి చదువుల తీరుతెన్నులపై తన అభిప్రాయాలను వివరిస్తూ వీడియో విడుదల చేశారు. ఫీజు రీ ఇంబర్సుమెంట్ తో చదువుల విప్లవం తెస్తా అని జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు.

ఈ సంధర్బంగా జగన్ చేసిన వ్యాఖ్యలు కాసింత అవగాహనారాహిత్యం అనుకోవాలో జనాలని మోసం చేసేలా ఉన్నాయనో అనుకోవాలి. ప్రస్తుతం ఉన్న స్కీంలో భాగంగా ప్రభుత్వం ఇంజనీరింగ్ కు 30-35 వేలు ముష్టి వేస్తుందంట. వేల కుటుంబాలకు లబ్ది చేకూర్చే ఇటువంటి పథకాలలో ప్రతి విద్యార్థికి 30-35 వేలు అంటే ముష్టా?

ADVERTISEMENT

జగన్ వంటి లక్షల కోట్లు పోగేసిన వారు తప్ప ఎవరైనా ఆ మాట అనగలరా? ధనిక రాష్ట్రమైన తెలంగాణాకూడా ఫీజు బకాయిలు చెల్లించలేక అవస్థ పడుతుంది. జగన్ ఒక అడుగు ముందుకేసి ఇంజనీరింగ్, డాక్టర్, కలెక్టర్ ఇంకా పైన ఎమన్నా చదువులు చదివితే పూర్తిగా ఫీజు ఆయన ప్రభుత్వం భరిస్తుందని చెప్పుకొచ్చారు.

రైతులకు ఒకసారి లక్షన్నర రుణమాఫీ చెయ్యడం సాధ్యం కాదు అని చెప్పిన జగన్. వీటికి డబ్బు ఎక్కడ నుండి తెస్తారు? డాక్టర్ చదవాలి అంటే లక్షల నుండి ఒక్కోసారి కోట్లు కూడా అవసరం అవుతాయి. ఇవన్నీ లోటు బడ్జెట్ తో సతమతం అవుతున్న గవర్నమెంట్ ఎక్కడ నుండి తెస్తుంది? లేకపోతే జగన్ ఎమన్నా సొంత ఆస్తులు తెచ్చి పంచి పెడతారా?

రోజుకు 100 రూపాయిలు సంపాదించడానికి తిప్పలు పడేవారు ఉన్న మన దేశంలో 30-35 వేలు అంటే ముష్టి అనడం ఒక జగన్ కే చెల్లింది. స్కూల్ కు వెళ్లే ప్రతి విద్యార్థి తల్లికి ఆయన 15000 ఇస్తారంట సంవత్సరానికి. ఏ స్కూల్ కి పంపిన ఇచ్చేస్తారట. అదే డబ్బు సర్కారీ స్కూళ్లలో విద్య ప్రమాణాలు మెరుగుపర్చడానికి ఖర్చు పెడితే ఎలా ఉంటదనే ఆలోచన లేని నాయకులు ఉన్నారు మనకు.అధికారంలోకి రావడమే పరమావధిగా హామీలు ఇస్తూ పోతే ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుందా?

ADVERTISEMENT
Latest Stories