కోడి కత్తికి ఇంకా ఎందుకు పదును పెడుతున్నారో?

Kodi_Kathi_Case2018లో విశాఖ విమానాశ్రయంలో జగన్మోహన్ రెడ్డిపై శ్రీనివాసరావు అనే దళిత యువకుడు కోడికత్తితో దాడి చేశాడు. ఆ దాడిలో జగన్‌కు భుజంపై స్వల్ప గాయం అయ్యింది. అప్పటి నుంచి అతను జైల్లో మగ్గుతూనే ఉన్నాడు.

ADVERTISEMENT

దీని వెనుక పెద్ద రాజకీయ కుట్ర దాగి ఉందని చెపుతూ ఈ కేసు విచారణను ఎన్ఐఏకి అప్పగించగా అది కూడా చాలా లోతుగా దర్యాప్తు జరిపి దీనిలో ఎటువంటి కుట్ర కోణమూ లేదని తేల్చి చెప్పింది. నిందితుడు శ్రీనివాసరావు తన వాంగ్మూలంలో ‘తాను జగన్‌ అభిమానినని, కనుక 2019 ఎన్నికలలో ఆయనకు ప్రజలలో సానుభూతి ఏర్పడేందుకే కోడికత్తితో చిన్నగా గాయపరిచానని’ చెప్పాడు.

విజయవాడ ఎన్ఐఏ కోర్టులో ఈ కేసు విచారణ దాదాపు పూర్తయింది. ఒక్కసారి జగన్‌ స్వయంగా కోర్టుకు వచ్చి సాక్ష్యం చెపితే తీర్పు చెప్పేందుకు న్యాయస్థానం సిద్దంగా ఉంది. కానీ తాను కోర్టుకి వస్తే ట్రాఫిక్ జామ్‌ అవుతుందని, భద్రతాపరమైన సమస్యలు ఏర్పడుతాయని చెపుతూ హాజరుకావడం లేదు.

ఈ కేసులో ఎన్ఐఏ లోతుగా దర్యాప్తు జరిపి ఈ కుట్రకు పాల్పడిన వ్యక్తులెవరో తేల్చకుండా ‘మమ’ అనిపించేయడం వలన తనకు అన్యాయం జరుగుతోందని జగన్‌ తరపు పిటిషన్‌ దాఖలైంది.

ఇప్పుడు ఈ కేసు విశాఖలో కొత్తగా ఏర్పాటైన ఎన్ఐఏ కోర్టుకి బదిలీ అయ్యింది. అంటే కేసు విచారణ మళ్ళీ మొదటి నుంచి ప్రారంభం కావచ్చన్న మాట!

ఈ కేసులో ఎటువంటి కుట్ర కోణమూ లేదని ఎన్ఐఏ స్పష్టంగా చెపుతున్నప్పటికీ ఈ కోడికత్తి కేసును ఇంకా ఎందుకు సాగదీస్తున్నారో తెలీదు. దీంతో ఆయన ఏమి సాధించాలనుకొంటున్నారో తెలీదు.

వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి బయటే తిరుగుతున్నారు. పార్లమెంట్ సమావేశాలకు కూడా హాజరవుతున్నారు. దళిత యువకుడు సుబ్రహ్మణ్యంని హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబుకి కూడా బెయిల్‌ లభించింది. కానీ జగన్‌ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కోడికత్తితో గాయపరిచినందుకు దళిత యువకుడు శ్రీనివాసరావు 5 ఏళ్ళుగా జైలులో మగ్గుతూనే ఉన్నాడు.

సోనియా, ప్రియాంకా, రాహుల్ గాంధీలు దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ హంతకులను క్షమించడంతో వారందరూ జైలు నుంచి విముక్తి పొందారు. కానీ దళితులు, బీసీల మీద ప్రేమ ఒలకబోసే సిఎం జగన్‌, ఓ దళిత యువకుడిని క్షమించలేకపోతున్నారు… ఎందువల్ల?

ADVERTISEMENT
Latest Stories