
రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఆదివారం టీడీపీ నిర్వహించిన ‘జయహో బీసీ’ బహిరంగ సభ దీనికి భారీ సంఖ్యలో బీసీలు హాజరుకావడంతో టీడీపీ శ్రేణులలో ఉత్సాహం వెల్లివిరిసింది. ఎన్నికలకు 75 రోజులు మాత్రమే ఉండడంతో టీడీపీకి ఎప్పటినుండో అండగా ఉండే బీసీల సభకు రెస్పాన్స్ అదిరిపోవడంతో ప్రతిపక్ష పార్టీలలో కూడా కలవరం మొదలయ్యింది. ప్రధానప్రతిపక్ష పార్టీ వైఎస్సాఆర్ కాంగ్రెస్ అయితే ఇంకో అడుగు ముందుకేసి జాగ్రత్త పడటం మొదలు పెట్టింది.
పార్టీలోని బీసీ నాయకులతో జగన్ తన లోటస్ పాండ్ రెసిడెన్స్ లో సమావేశం అయ్యారు. టీడీపీకి పోటీగా పార్టీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 19న బీసీ గర్జన నిర్వహించాలని నిర్ణయించారు. ‘జయహో బీసీ’ బహిరంగ సభలో చంద్రబాబు ఆయన వర్గాలకు ప్రకటించిన తాయిలాలకు ధీటుగా వరాలు వైఎస్సాఆర్ కాంగ్రెస్ తలపెట్టిన సభలో ప్రకటించాలని నిర్ణయించారు. అయితే దీనిని టీడీపీ వర్గాలు ఎద్దేవా చేస్తున్నాయి. టీడీపీ సభ సక్సెస్ ఐన వెంటనే జగన్ కు బీసీలపై ప్రేమ పుట్టుకొచ్చిందని వారు ఆక్షేపిస్తున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీసీ జాబితాలో ఉన్న 32 కులాలను తెలంగాణలో తెరాస ప్రభుత్వం తొలగించిన అలాంటి పార్టీకి జగన్ వత్తాసు పలుకుతున్నారు. రాష్ట్రం విడిపోయినంత మాత్రాన మనవాళ్లకు అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించాల్సిన బాధ్యత మనపై లేదా? అంటూ వారు వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయ విమర్శలు ఎలా ఉన్నా టీడీపీ బీసీ సభ సక్సెస్ అవ్వడంతో ఆ ప్రభావం జగన్ మీద కచ్చితంగా పడిందనే చెప్పుకోవాలి. ఈ అత్యవసర బీసీ నేతల మీటింగే దానికి నిదర్శనం అని చెప్పుకోవచ్చు.



