మోడీ, అమిత్ షాలు ఇక నిద్ర నటించలేరుగా?

YS-Jagan-Amit-Shahవైసీపి ప్రభుత్వం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి 28 రోజులుగా జైల్లో ఉంచిన్నప్పటికీ ఇంతవరకు ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు కనీసం స్పందించకపోవడం చాలా ఆశ్చర్యకరం. వారు దేశం మొత్తం చూసుకోవలసి ఉంటుంది కనుక ప్రతీ విషయంపై స్పందించలేకపోవచ్చునని పవన్‌ కళ్యాణ్‌ సమర్ధన సహేతుకంగానే ఉందనుకొన్నా, వారి మౌనం బీజేపీ-జనసేనల పొత్తులను కూడా ప్రభావితం చేస్తోంది కదా? అప్పుడు కూడా వారు మౌనం వహిస్తున్నారంటే వైసీపి ప్రభుత్వం నిర్ణయాన్ని సమర్ధిస్తున్నట్లే కదా?

ADVERTISEMENT

వారి అనుమతితోనే చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశారనే వాదనలతో ఏపీ బీజేపీ రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పటికీ వారు మౌనం వీడకపోవడం విచిత్రం. అయితే ఇంతకాలం వారు ఈ విషయంలో నిద్ర నటిస్తున్నా, జగన్మోహన్‌ రెడ్డి వారితో భేటీ అయ్యి అన్నీ వివరించే ఉంటారు కనుక ఇకనైనా నిద్రలేచి స్పందించక తప్పదు.

లేదా చంద్రబాబు నాయుడు విషయంలో వారు ఇదే వైఖరి కొనసాగిస్తూ, ఆయన అరెస్టు పట్ల తమకు ఎటువంటి అభ్యంతరం లేదని ఆంధ్రా ప్రజలకు చెప్పకనే చెప్పవచ్చు.

జగన్‌ ఢిల్లీ పర్యటన ముగించుకొని తిరిగి వచ్చిన తర్వాత వైసీపి ప్రభుత్వం వెనక్కు తగ్గుతుందా లేక ఇదే దూకుడు కొనసాగిస్తుందా?అనే దానిని బట్టి చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలో వారిద్దరి వైఖరి ఏమిటనే విషయం తెలియవచ్చు.

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చంద్రబాబు నాయుడుని కలిసి వచ్చిన తర్వాత శనివారం మధ్యాహ్నం ఢిల్లీకి బయలుదేరుతుండటం విశేషం. తన అరెస్ట్, ఈ కేసుల విషయంలో న్యాయపరంగా, రాజకీయంగా ఏవిదంగా ముందుకు సాగాలో చంద్రబాబు నాయుడు ఆయనకు కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చి ఉండవచ్చు. బహుశః అందుకే నారా లోకేష్‌ మళ్ళీ వెంటనే ఢిల్లీ బయలుదేరుతున్నట్లు భావించవచ్చు.

ఏది ఏమైనప్పటికీ, ఇప్పుడు ఈ వ్యవహారంపై తాడో పేడో తేలిపోయే సమయం ఆసన్నమైన్నట్లే ఉంది. చంద్రబాబు నాయుడు మరికొన్ని నెలలు జైల్లోనే ఉండబోతున్నారా లేక త్వరలోనే బెయిల్ పొంది బయటకు రాబోతున్నారా? ఒకవేళ బెయిల్ పొంది బయటకు వచ్చిన తర్వాత వైసీపి ప్రభుత్వం మళ్ళీ ఆయన జోలికి వెళ్లకుండా దూరంగా ఉంటుందా లేక మరో కొత్త కేసు నమోదు చేసి మళ్ళీ అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తుందా? అని విషయాలు త్వరలోనే తేలిపోయే అవకాశం ఉంది.

ADVERTISEMENT
Latest Stories