జగన్ బెయిల్ కండిషన్ లో ఉంది కదా!

YS Jagan CBI Courtఅక్రమాస్తుల కేసు విచారణకు హాజరు కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రతిసారి మినహాయింపు కోరడంపై సీబీఐ కోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. విచారణకు ఎందుకు హాజరు కావడం లేదో ప్రశ్నించిన సీబీఐ కోర్ట్, జగన్ కు మంజూరు చేసిన బెయిల్ కండిషన్ లో స్వయంగా విచారణకు హాజరు కావాలన్న ఉదంతాన్ని గుర్తు చేసారు.

దీనిపై జగన్ తరపు న్యాయవాది వివరణ ఇచ్చుకున్నారు. వ్యక్తిగత హాజరుపై మినహాయింపును కోరుతూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ ను దాఖలు చేశామని, త్వరలోనే దీనిపై తీర్పు రానుందని, తీర్పు వచ్చేవరకు వేచిచూడాల్సిందిగా కోరారు. ఈ వివరాలన్నీ మెమో రూపంలో రూపంలో కోర్టుకు సమర్పించాలని జగన్ తరపు న్యాయవాదిని ఆదేశించగా, వెంటనే మెమో దాఖలు చేసారు.

ADVERTISEMENT

ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన వ్యక్తిగత హాజరుపై మినహాయింపు పిటిషన్ ను గతంలో సీబీఐ కోర్టులో జగన్ న్యాయవాది దాఖలు చేసారు. అయితే దీనిని కొట్టివేస్తూ జగన్ ఖచ్చితంగా హాజరు కావాల్సిందేనని సీబీఐ కోర్టు స్పష్టం చేసింది. దీంతో జగన్ న్యాయవాది హైకోర్టును ఆశ్రయించగా, ఇప్పటికే విచారణ పూర్తయ్యి, తీర్పు రిజర్వులో ఉంచింది.

ADVERTISEMENT
Latest Stories