ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి సారథ్యంలోని రాష్ట్ర మంత్రివర్గం కొలువుతీరింది. 25 మంది మంత్రులు ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. వారు ఈరోజు ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. కీలకమైన హోమ్, ఆర్ధిక, జలవనరుల శాఖ శాఖలను కొత్త మంత్రులైన మేకతోటి సుచరిత, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ లకు అప్పగించడం విశేషం. జగన్ కు సన్నిహితులైన పిల్లి సుభాస్ చంద్రబోస్, ఆళ్ల నానిలను డిప్యూటీ ముఖ్యమంత్రులను చేశారు. పిల్లి సుభాస్ చంద్రబోస్ కు రెవిన్యూ వంటి ప్రాధాన్యత కలిగిన శాఖను కూడా ఇవ్వడం విశేషం. 2014 తరువాత పార్టీలోకి వచ్చిన బొత్స సత్యనారాయణకు ప్రాధాన్యత కలిగిన మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖను కేటాయించారు.
మేకతోటి సుచరిత-హోంశాఖ
బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి-ఆర్థిక శాఖ
అవంతి శ్రీనివాస్-పర్యాటక శాఖ
బొత్స సత్యనారాయణ – మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ,
ధర్మాన కృష్ణ దాస్- రోడ్లు, భవనాలు
అనిల్ కుమార్ యాదవ్ -జలవనరుల శాఖ
మేకపాటి గౌతం రెడ్డి : పరిశ్రమలు, వాణిజ్యం
పిల్లి సుభాస్ చంద్రబోస్ -రెవెన్యూ శాఖ(డిప్యూటీ సీఎం)
కన్నబాబు – వ్యవసాయ శాఖ
పుష్ప శ్రీవాణి – గిరిజన సంక్షేమం(డిప్యూటీ సీఎం)
తానేటి వనిత -మహిళా, శిశు సంక్షేమం
కొడాలి నాని-పౌర సరఫరాల శాఖ
మోపిదేవి వెంకటరమణ-పశుసంవర్థక శాఖ
పినిపే విశ్వరూప్- సాంఘిక సంక్షేమం
ఆళ్ల నాని- వైద్య,ఆరోగ్య శాఖ(డిప్యూటీ సీఎం)
పేర్ని నాని -రవాణా, సమాచార శాఖ
ఆదిమూలపు సురేశ్- విద్యాశాఖ
బాలినేని శ్రీనివాస్ – అటవీ,పర్యావరణం
గుమ్మనూరు జయరాం-కార్మిక, ఉపాధి శాఖ
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి -పంచాయతీరాజ్
శంకర్ నారాయణ-బీసీ సంక్షేమం
అంజాద్ బాషా- మైనారిటీ వ్యవహారాలు(డిప్యూటీ సీఎం)
నారాయణ స్వామి-ఎక్సైజ్, వాణిజ్య పన్నులు(డిప్యూటీ సీఎం)
వెల్లంపల్లి శ్రీనివాసరావు-దేవాదాయ శాఖ



