ప్రతిపక్షనేత వైఎస్ జగన్ పాదయాత్ర నెల్లూరు జిల్లాలో1,000 కిలోమీటర్లు పూర్తిచేసుకుంది. 3వేల కిమీ సుదీర్ఘ పాదయాత్రలో 1,000 కిలోమీటర్ల మైలురాయిని వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం వద్ద దాటారు. ఈ సందర్భంగా సైదాపురంలో పైలాన్‌ను ఆవిష్కరించారు. పెద్ద ఎత్తున జనసమీకరణ చేసారు ఈ సంధర్భంగా.
అయితే జగన్ కు పెద్దగా ఆనందం మిగలలేదు. కారణం ఒక్క సాక్షి తప్ప ఎవరూ ఈ సంధర్భాన్ని పట్టించుకున్నది లేదు. ప్రధాన పత్రికలైన ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలలో మొదటి పేజీలలో ఎక్కడ జగన్ వెయ్యికిలోమీటర్ల పాదయాత్రకు ప్రాముఖ్యత ఇవ్వలేదు. టీవీలలో కూడా ప్రముఖ ఛానళ్ళు ఏవి పట్టించుకున్న పాపాన పోలేదు.
ఒక్క సాక్షి టీవీ, పత్రిక మాత్రమే తమ ప్రయత్నం తాము చేసాయి. పాదయాత్ర మొదలు పెట్టే ముందే జగన్ ఆంధ్రజ్యోతి తప్ప అన్ని సంస్థల ఎడిటర్లను కలిసి సహకరించాల్సిందిగా అభ్యర్ధించారు. రామోజీ రావుని అయితే స్వయంగా వెళ్లి కలిశారు. అయితే ఇవేమి పెద్దగా పని చెయ్యలేదనే చెప్పుకోవాలి.
దీనితో జగన్ లో నిరాశ ఆవహించిందట. అయితే ఇప్పటికే చెయ్యాల్సిన ప్రయత్నాలు అన్నీ చేసెయ్యడం ఇంక ఏంచెయ్యాలో పాలుపోవడం లేదు. మీడియా అంతా చంద్రబాబుకు అమ్ముడు పోయింది అంటూ ఆ పార్టీ నాయకులు బహిరంగ విమర్శలు చేస్తున్నారు. అయితే ఇటువంటి వ్యాఖ్యల వల్ల నష్టమే కానీ ఎలాంటి లాభం ఉండదు అన్న విషయం వారికి తెలియనిదా?



