కీలక అంకంలోకి ప్రవేశించిన జగన్ పాదయాత్ర

YS Jagan- Padayatra in coastal andhraప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్రలో తొలి అంకం పూర్తి చేసుకున్నారు. ఆయన చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించింది. ఆయన పాదయాత్ర దాదాపుగా 1000 కిలోమీటర్ల మార్కు కు చేరింది. ఇప్పటిదాకా జగన్ ఆయనకు అనుకూలంగా ఉండే రాయలసీమలో పాదయాత్ర చేసారు.

ADVERTISEMENT

2014 ఎన్నికల తరువాత తెలుగు దేశం పార్టీ కొంతమేర బలపడిన ఇప్పటికి రాయలసీమలో వైకాపా స్ట్రాంగ్ గానే ఉంది. ఇప్పుడు జగన్ కోస్తాలో పాదయాత్ర మొదలు పెట్టబోతున్నారు. ఇక నుండి ఆయనకు ప్రతి జిల్లా చాలా ఇంపార్టెంట్ అనే చెప్పుకోవాలి. కొంతమేర నెల్లూరులో తప్ప మిగతా అన్ని జిల్లాలలో పార్టీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది.

ఇప్పటిదాకా 68 రోజుల పాటు పాదయాత్ర సాగింది. మిగిలిన 2000పై చిలుకు కిలోమీటర్లు నడవడానికి ఇంకా ఎన్ని రోజులు పడతాయో చూడాలి. అయితే పెద్దగా మీడియా సహకారం లేకపోవడం, పాదయాత్ర పెద్దగా ప్రజలపై ప్రభావం చూపకపోవడంతో పార్టీ ఒకరకంగా నిరాశగానే ఉందని చెప్పాలి.

ADVERTISEMENT
Latest Stories