సొంత నేతలకే తలపోటుగా మారిన జగన్ పాదయాత్ర

YS Jagan Padyatra headache for own party leadersవిపక్షనేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర ఇప్పటివరకు 95 రోజుల పాటు సాగింది. సాక్షి పత్రిక చెబుతున్న లెక్కల ప్రకారం 1282.3 కిలోమీటర్ల మేర ఆయన నడిచారు. అయితే గత కొన్ని రోజులుగా జగన్ పాదయాత్రకు కొత్త సమస్య ఎదురవుతుంది. ఈ మధ్య కాలంలో పాదయాత్రకు జానాల తాకిడి కాసింత పల్చపడ్డారు. ఇక అక్కడ నుంచి ప్రతి చోటికి జనాన్ని తరలించడం మొదలయ్యింది.

అయితే పంటల సీజన్‌ కాబట్టి నేతలకు జనాన్ని తరలించడం కష్టంగా మారిందట! దీనితో వీలైనంత వరకు బహిరంగ సభలు తగ్గించుకోవాలని వారు అధినాయకుడికి సూచిస్తున్నారు. రాష్ట్రంలో నెమ్మదిగా ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. దీనితో జన సమీకరణ మరింత కష్టంగా మారబోతుందని ఆ పార్టీ నాయకులు కలవరపడుతున్నారు.

ADVERTISEMENT

ఇప్పటిదాకా జగన్ పాదయాత్ర సగం కూడా పూర్తి కాలేదు. దాదాపుగా 1700 కిలోమీటర్ల మేర నడవాల్సింది మిగిలి ఉంది. చూడబోతే వేసవి అంతా ఆయన నడవాల్సి వచ్చేలా ఉంది. కాబట్టి నేతలు కాస్త కలవరపడుతున్నారు. పార్టీ గనుక బడ్జెట్ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయిస్తే ఒక నెల విరామం రావొచ్చు అని నేతలు భావిస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories