పేదల ఇళ్లా వైసీపీ పార్టీ ప్రచార కేంద్రాలా?

YS-Jagan-Photos-On-Housesవైసీపీ పార్టీ ప్రచార ఆర్భాటాలకు కాదేది అనర్హం అనేది గడిచిన నాలుగున్నరేళ్ళ పాలనతోనే జగన్ ప్రభుత్వం రుజువు చేసుకుంది. ప్రభుత్వ కార్యలయాలకు,వాటర్ ట్యాంకులకు,మున్సిపాలిటు చెత్త సేకరించే వాహనాలకు,ఇంటి వద్దకే రేషన్ అంటూ రేషన్ తరలించే వాహనాలకు, కరెంటు స్తంభాలను,చివరికి చెట్టుకి గట్టుకి కూడా వైసీపీ రంగులు వేసి ప్రభుత్వ ఆదాయాన్ని తన పార్టీ బలోపేతానికి వాడుకుపోవడంలో జగన్ చాల వరకు విజయం సాధిచించారనే చెప్పాలి.

ADVERTISEMENT

న్యాయస్థానాలు వైసీపీ ప్రచార ఆర్భాటాలకు ఎన్ని మొట్టికాయలు వేసిన వైసీపీ వైఖరిలో ఏమాత్రం మార్పు రాలేదు. కొత్తగా ఇప్పుడు ఇంటి గోడల మీద, వ్యవసాయ భూములకు ఇచ్చే పాస్ పుస్తకాల మీద, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఇచ్చే స్కూల్ బ్యాగ్గుల మీద, చివరకు చిన్న పిల్లలకు పెట్టె చిక్కి మీద కూడా జగన్ ఫొటోలే దర్శనమివ్వడం జగన్ లో ఉన్న ప్రచార పిచ్చికన్నా తనను రోజు ఏదోవిధంగా ప్రజలు గమనిస్తూ ఉండాలి లేకపోతే తాను ఎవరిని గమనించలేని ప్రాంతానికి వెళ్లాల్సి వస్తుందన్న భయమే ఎక్కువ కనపడుతున్నట్టుడి.

ఇక పోను పోను పేదలకు ఇచ్చే బియ్యపు గింజల మీద కూడా జగన్ ఫోటో ముద్రిస్తారేమో చూడాలి. కనీసం అది చేసిన అంత చిన్న వస్తువుల పై ఫోటోలు ముద్రించగలిగే నైపుణ్యాన్నైయినా వెలికితీసిన వారవుతారు. అసలు విషయానికి వస్తే., సామర్లకోటలో నిర్మించిన పేదల ఇళ్ల సామూహిక గృహ ప్రవేశానికి సీఎం.జగన్ హాజరయ్యారు.

రాష్ట్రంలో ప్రభుత్వ అమలు చేస్తున్న ఏ సంక్షేమ పథకానికైనా జగనన్నపేరు కానీ లేదా ఆయన తండ్రి వైస్సార్ విగ్రహం కానీ అక్కడ ఉండాలసిందే లేదా కనీసం అక్కడ ఉన్న ఒకప్పటి నేతల పేర్ల మార్పులైనా చేయాల్సిందే. ప్రజల టాక్సులతో పొందిన ప్రభుత్వ ఆదాయంతో ఇళ్లను నిర్మించడం,లేదా గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఇళ్లకు రంగులు మార్చి ప్రజలను ఏమార్చడం జగన్ కు అలవాటైన పనే.

అయితే సామర్ల కోటాలో నిర్మించిన జగనన్న కాలనీల ప్రారంభోత్సవంలో పాల్గొన్న జగన్ ఆ కాలనీవాసులకు తన తండ్రి విగ్రహాన్ని బహుమతిగా ఇచ్చినట్టున్నారు. ఇంటి ముందో, కాలనీ ముందో పెట్టాల్సిన దేవుని విగ్రహానికి బదులు వైస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించడం జగన్ పేదవారిని మభ్య పెట్టడమే అవుతుంది. వైస్సార్ మీద అంత ప్రేమే ఉంటే ప్రతి వైస్సార్ నాయకుడి ఇంటి ముందు కూడా వైస్ విగ్రహాల ప్రతిష్ట జరగాలిగా? లేదా వారి ఇంటికి జగనన్న నిలయంగా పేరు మార్చుకోవచ్చుగా? కానీ అవి చేయరు!

ఇలా ప్రజలకు అందించే పతకాలకు మాత్రమే వైస్ బ్రాండ్ కావాలి. అయినా ప్రజలు ఇష్టపడి కాలనీలో వైస్సార్ విగ్రహం పెట్టుకుంటే అది వారి మనసులో ఉన్న అభిమానాన్ని తెలుపుతుంది ఆలా కాకుండా మీరే విగ్రహాలు పెట్టి ప్రజలపై ఈ బలవంతపు రుద్దుడులు ఏమిటి సామి! రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి వైసీపీ ప్రభుత్వం మంచిచేసింది అని మీరు భావించినప్పుడు ప్రచారాల కోసం ఈ ఆరాటాలు ఎందుకో? ఓట్ల కోసం ప్రయాసలేంటి?

పేదల కోసం ప్రభుత్వాలు చేసే పనులు విగ్రహాల ప్రతిష్ఠలతోనే రుజువు చేసుకోవాలా? ప్రభుత్వ పథకాల? లేక పార్టీ ప్రచార కార్యక్రమాలా?అంటూ నలుగురు నవ్విపోతున్న వైసీపీ ప్రభుత్వం నిస్సిగ్గుగా తన పని తానూ చేసుకుంటూ పోతుంది.

ADVERTISEMENT
Latest Stories