ఉన్నఫళంగా జగన్ పోలవరానికి బయల్దేరింది అందుకేనా?

YS Jagan Polvaram tour-ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత మొట్టమొదటి సారిగా ఆంధ్రప్రదేశ్ కు ప్రాణవాయువు వంటి పోలవరం ప్రాజెక్టును సందర్శించబోతున్నారు జగన్ మోహన్ రెడ్డి. సీఎం జగన్ పోలవరం సందర్శనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. జగన్ అధికారంలోకి రాగానే టెండర్లలో అవకతవకల పేరుతో ప్రాజెక్టు వద్ద పనులు ఆపించారు. కాంట్రాక్టర్లకు మౌఖిక ఆదేశాలతో పనులు ఆపించారని సమాచారం. అదే సమయంలో పోలవరం అథారిటీ కూడా ఏవో టెక్నికల్ అంశాలతో పనులు ముందుకు సాగనీయడం లేదు.

ఇది ఇలా ఉండగా జగన్ పోలవరం పర్యటనపై సోషల్ మీడియాలో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రేపు తెలంగాణాలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా వెళ్లనున్నారు జగన్. అయితే చివరి నిముషంలో సొంత రాష్ట్రంలోని పోలవరం ప్రాజెక్టును సందర్శించకుండా పొరుగురాష్ట్రంలోని కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వెళ్తే విమర్శలు వస్తాయని కొందరు నాయకులు చెప్పడంతో ఉన్నఫళంగా పోలవరం సందర్శనకు బయల్దేరారు జగన్.

ADVERTISEMENT

పోలవరం ప్రాజెక్టుపై ఇంకా రూ.34,751.06 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. ఒక్క పునరావాసంపైనే రూ.27,025.65 కోట్లు ఖర్చు చేయాలి. కేంద్రం నుంచి పెండింగ్‌లో ఉన్న నిధులు కలిపి ఈ ప్రాజెక్టుకు ప్రస్తుత లెక్కల ప్రకారం రూ.39,561.10 కోట్లు రావాలి. రాష్ట్రం ఈ డబ్బు పెట్టి ప్రాజెక్టు నిర్మాణాన్ని ముందుకు నడిపించే పరిస్థితి లేదు. దీనితో కేంద్రప్రభుత్వం సాయం ఎంతో కీలకం. ఈ నిధులను రాబట్టే క్రమంలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌, ఇతర కేంద్ర పెద్దలను ముఖ్యమంత్రి జగన్‌ త్వరలో కలిసే అవకాశముందని సమాచారం.

ADVERTISEMENT
Latest Stories