ysjagan-

విభజనతో గాయపడిన రాష్ట్రానికి ప్రత్యేక హోదానే సంజీవిని, దానిని సాధించడానికి వైసీపీ కేంద్రం మెడలు కూడా వంచుతుంది అంటూ 2019 లో ప్రజలను మభ్యపెట్టి అధికారాన్ని దక్కించుకున్న జగన్ 151 అసెంబ్లీ సీట్లతో 22 ఎంపీ సీట్లతో గణ విజయం సాధించారు.

అయితే 2014 ఎన్నికలలో ప్రజల నమ్మకాన్ని పొందలేకపోయింది వైసీపీ. కానీ 2019 ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని ప్రత్యక హోదా అంశాన్ని పట్టుకుని జిల్లా జిల్లాకు తిరుగు, నిరసన సభలను ఏర్పాటు చేస్తూ అటు విద్యార్థులను సైతం రెచ్చకొడుతూ, హోదా కోసం టీడీపీ ఎంపీ లను రాజీనామా చేయమంటూ ఒత్తిడి చేసిన జగన్ మొత్తానికి ఒక్క ఛాన్స్ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు.

Also Read – చంద్రబాబు పాలనకు జీరో మార్కులట మరి…

జగన్ అనే నేను…అంటూ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్ కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి హోదా తెస్తాను అంటూ ఇచ్చిన మాటను ప్రమాణస్వీకారం చేసిన రోజే గాలిలో కలిపేశారు. ఇక అప్పటి నుంచి 2024 ఎన్నికల వరకు హోదా కోసం బీజేపీ పెద్దల మెడలు వంచలేదు, ఆ పార్టీ ఎంపీ లను రాజీనామా చేపించలేదు సరికదా అటు పార్లమెంట్ లోను ఇటు పెద్దల సభలోని బీజేపీ ప్రభుత్వం పెట్టిన ప్రతి బిల్లుకు ఎటువంటి షరతులు లేకుండా మద్దతు పలికింది వైసీపీ.

అప్పుడు గుర్తు రాని ప్రత్యేక హోదా వైసీపీ నేతలకు మళ్ళీ ప్రతిపక్షంలోకి వచ్చే సరికి గుర్తొచ్చేసింది. కూటమి పార్టీ 164 అసెంబ్లీ సీట్లతో 22 పార్లమెంట్ సీట్లతో అఖండ విజయం సాధించింది కాబట్టి టీడీపీ ఎంపీ లు బీజేపీ తో యుద్ధం చేసైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించాలంటూ మళ్ళీ పాత రాగం అందుకున్నారు వైసీపీ నేతలు.

Also Read – భయపడ్డారా.? భయపెడుతున్నారా.?

కనీసం ప్రజలు నవ్వుకుంటారు అనే సృహ కూడా లేకుండా విజయసాయి రెడ్డి వంటి నెంబర్ 2 వ్యక్తులు ఇలా మీడియా ముందు నోరు పారేసుకోవడం చూస్తుంటే ఆశ్చర్యం కలగక మానదు. ఇన్నాళ్లుగా తన అక్రమ కేసుల నుండి జైలుకు వెళ్లకుండా తప్పించుకోవడానికి, తన ముద్దుల చిన్న తమ్ముడు అవినాష్ రెడ్డిని జైలు పాలు కాకుండా కాపాడుకోవడానికి ప్రత్యక హోదాను తాకట్టుపెట్టిన జగన్ ఇప్పుడు హోదా గురించి మాట్లాడడం శోచనీయం.

ఇప్పటికి వైసీపీ చేతులో 4 గురు ఎంపీలు, 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. మా అవసరం బీజేపీ కి తప్పకుండా ఉంటుంది. మమ్మల్ని కూడా గుర్తించండి అంటూ గుర్తింపు కోసం పరితపిస్తున్న విజయ సాయి రెడ్డి ఆక్రందనలు బీజేపీ పెద్దలు పట్టించుకుంటారా.? అంటే వైసీపీ నేతలే జవాబు చెప్పలేరు. అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని కాదని ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసే దమ్ము ధైర్యం జగన్ కు ఉంటుందా.?

Also Read – కోడి కత్తి కేసు కూడా ఇలా బెడిసి కొట్టిందే!

ఇప్పటికే దాదాపు 30 కేసులు వెనకేసుకున్న జగన్ ఈ ఐదేళ్లల్లో మరి కొన్ని కేసులను ఎదుర్కోకతప్పదు. అవినాష్ పరిస్థితి ఏమిటో అర్ధం కానీ స్థితి. ముఖ్యమంత్రిగా అధికారం ఉన్నప్పుడే వివేకా కుమర్తె సునీతా జగన్ కు అవినాష్ కు వ్యతిరేకంగా పోరాటం చేసింది. మరి ఇప్పుడు ఆ అధికారం కూడా దూరమైతే సునీతా మోనంగా ఉంటుందా.? జగన్, అవినాష్ రెడ్డి తో ఊరుకుంటుందా లేక భారతి రెడ్డిని కూడా ఈ కేసులోకి లాగుతుందో ఊహించలేని దుస్థితి జగన్ ది.

కేసులతో అష్ట దిగ్బంధంలో ఉన్న జగన్ హోదా కోసం బీజేపీని ఎదురిస్తారు అనుకోవడం పగటి కల మాదిరే ఉటుందని అందరికి తెలిసిన విషయమే అయినప్పటికీ విజయ సాయి ఎవరిని బెదిరించడానికి, ఎవరిని బయపెడతానికి ప్రయత్నిస్తున్నారు.? అసలు హోదా గురించి మాట్లాడే నైతిక హక్కు కానీ కనీస హోదా కానీ వైసీపీ కి లేదంటూ సోషల్ మీడియాలో కౌంటర్లు పేలుతున్నాయి.