ముఖ్యమంత్రి జగన్, జనసేనాని పవన్ కళ్యాణ్ కు “యూజ్ అండ్ త్రో” ఆడవారిని వాడుకోవడం వదిలేయడం బాగా అలవాటు అని తరచుగా విమర్శిస్తుంటారు. అయితే “యూజ్ అండ్ త్రో” కి అసలైన ఉదాహరణగా చెప్పాల్సి వస్తే దానికి జగన్నే ఏకగ్రీవంగా ఎన్నుకోవాల్సి వస్తుందేమో!
అయితే ప్రతి విమర్శ మాత్రమే చేసి వదిలేస్తే ఎలా ఆ ఆరోపణలకు కొన్ని ఆధారాలు కూడా ప్రజల ముందుంచాలి కదా అనుకునేవారికి వైస్ కుటుంబసభ్యులే సాక్ష్యాలు. 2011 లో వైస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ప్రజాక్షేత్రంలోకి వచ్చిన జగన్ ఒక్క ఏడాదికే అక్రమాస్తుల కేసులలో నిందితుడిగా అరెస్టయ్యి 16 నెలల పాటు చంచల్ గూడా జైలు జీవితం గడిపారు.
జగన్ కటకటాల వెనకున్నప్పుడు జగన్ సోదరి వైస్ షర్మిల వైస్సార్ కాంగ్రెస్ పార్టీకి ముందుండి పార్టీని, పార్టీని నమ్ముకున్న నేతలను ప్రజలలో ఉంచగలిగారు. అప్పట్లో నేను జగనన్న వదిలిన బాణం అంటూ ఏపీ రాష్ట్రమంతా పాదయాత్ర చేసుకుంటూ వైసీపీ పార్టీని సుస్థిరపరిచారు. జగన్ రాజకీయ ప్రస్థానంలో షర్మిల పాదయాత్ర అతిముఖ్యమైన ఘట్టమనే చెప్పాలి.
అలాగే వైస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయాలలో ఉన్నప్పుడు ఎప్పుడు ప్రజల ముందుకు రాని జగన్ తల్లి విజయలక్ష్మి, కొడుకు రాజకీయ భవిష్యత్ కోసం రాజకీయ రణరంగంలోకి అడుగుపెట్టారు.ఎటువంటి రాజకీయ అనుభవం లేకపోయినా తన కొడుకుకి మద్దతుగా తన వయస్సుని కూడా లెక్కచేయకుండా రాష్ట్రంలో అనేక సభలు నిర్వహించి తన ఓటమిని కూడా పక్కన పెట్టి జగన్ ను ముఖ్యమంత్రిని చేసే వరకు కృషి చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్ ముఖ్యమంత్రి స్థాయికి చేరుకోవడంలో తల్లి – చెల్లి పాత్రే కీలకం అని చెప్పాలి. మరి ఇప్పుడు ఆతల్లి – చెల్లి ఎక్కడున్నారో సదరు ముఖ్యమంత్రిగారు సెలవిస్తే తెలుసోవడానికి ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారు.జగన్ కు అవసరమైనప్పుడు షర్మిల, విజయమ్మ అండగా నిలబడ్డారు, పాదయాత్రలు చేశారు, ప్రత్యర్థుల నుండి విమర్శలు ఎదుర్కొన్నారు ఇలా జగన్ కోసం చాలానే చేసిన తన తల్లి చెల్లిని జగన్ ‘యూజ్ అండ్ త్రో’ అంటే జగన్ భాషలో చెప్పాలంటే వాడుకుని వదిలేశారా?
అలాగే 2019 ఎన్నికల ముందు జగన్ బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్పటి టీడీపీ ప్రభుత్వం పై తమకు నమ్మకం లేదు ఈ కేసుని సీబీఐ విచారణకు ఇవ్వాలి అంటూ గగ్గోలు పెట్టిన జగన్ తండ్రి మరణంతో విషాదంలో ఉన్న ఆమె కూతురు, జగన్ సోదరి వైస్ సునీతా కు తన మద్దతు తెలిపి అప్పటి ప్రభుత్వం పై రాజకీయ విమర్శలు చేసి సోదరిని అడ్డుపెట్టుకుని రాజకీయ లబ్ది పొందిన మాట వాస్తవం కాదా?
అయితే జగన్ తానూ అధికారంలోకి వచ్చిన వెంటనే సునీత మీదే నిందలు వేయడం కదా ‘యూజ్ అండ్ త్రో’ అంటే! 2019 ఎన్నికలలో అధికారం పొందడానికి రాష్ట్రంలో ఉన్న ఎందరో ఆడపడుచులకు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను అంటూ హామీ ఇచ్చి వారి ఓట్లతో గద్దెనెక్కి ఇప్పుడు అదే ఆడపడుచుల పసుపు కుంకుమలతో వ్యాపారం చేస్తున్న జగన్ కదా “యూజ్ అండ్ త్రో పాలసీని” ఫాలో అయ్యేది అంటూ సోషల్ మీడియా వేదికగా జగన్ యూజ్ అండ్ త్రో పతాకాన్ని ప్రచారంలోకి తెస్తున్నారు నెటిజన్లు.
జగన్ యూజ్ అండ్ త్రో పథకంలో ఎవ్వరికి మినహాయింపులు ఉండవు అనేది సొంత పార్టీ నేతలైనా RRR ,కోటంరెడ్డి ,యార్లగడ్డ, ఉండవల్లి శ్రీదేవి విషయంలో రుజువయ్యింది.



