వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాసం పెట్టే తేదీని ముందుకు తీసుకు వచ్చింది.తొలుత ఈ నెల ఇరవై ఒకటిన అవిశ్వాస తీర్మానం పెడతామని ప్రకటించినా, ఈ నెల పన్నెండునే అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించినట్లు వైకాపా తెలిపింది. అంతకుముందు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వైకాపా ముందుగా అవిశ్వాసం పెడితే తాను దేశం మొత్తం తిరిగి మద్దత్తు కూడగడతా అన్నారు.
అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ నిజంగా చేదాం అనుకున్న చెయ్యడానికి అంతగా టైం లేదు. ఇది వైకాపా ఉద్దేశపూర్వకంగా చేసిందో ఏమో తెలీదు మరి. అవిశ్వాసతీర్మాణంపై మద్దత్తు కూడగట్టే ఉద్దేశం వైకాపాకు కూడా లేనట్టు ఉంది. కేవలం టీడీపీని ఇరుకునపెట్టడమే దీనికి లక్ష్యంగా కనిపిస్తుంది.
తెదేపా ఎప్పుడు పెట్టమంటే అప్పుడు పెడతామని, అవిశ్వాసానికి మద్దతు ఇస్తారో లేదో చంద్రబాబే తేల్చుకోవాలని ఆ పార్టీ నేత బొత్సా సత్యనారాయణ అన్నారు. అవిశ్వాస తీర్మానం తర్వాత తమ ఎమ్.పిలు రాజీనామాలు చేస్తారని కూడా బొత్స తెలిపారు. కొంపతీసి అవిశ్వాసం వల్ల టీడీపీ ఇబ్బంది పడాలి మోడీ ఇబ్బంది పడకూడదు అనేది వైకాపా వ్యూహమా.



