25 మంత్రులతో జగన్ కేబినెట్ రేపు కొలువు తీరబోతుంది. సామాజిక సమీకరణాలు దృష్టిలో పెట్టుకుని కూర్చిన కేబినెట్ లో ఏడుగురు బీసీలకు, ఎస్సీ వర్గానికి చెందిన ఐదుగురికి, (వీరిలో మాదిగ వర్గానికి 2, మాల వర్గానికి 3), కేటాయించారు. అలాగే కాపు, రెడ్డి వర్గాలకు నాలుగుచొప్పున ఇచ్చారు. వైశ్య, క్షత్రియ, కమ్మ, మైనార్టీ వర్గాలకు ఒక్కో మంత్రి పదవి కేటాయించారు. మరోవైపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు సామాజిక వర్గాలకు చెందిన ఐదుగురిని డిప్యూటీ సీఎంలుగా నియమిస్తున్నట్టు జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. డిప్యూటీ ముఖ్యమంత్రుల పేర్లు, మంత్రుల శాఖల పై రేపు ప్రకటన ఉంటుంది. రేపు ఉదయం 11.49గంటలకు వెలగపూడిలోని సచివాయలయం ప్రాంగణంలో నూతన మంత్రులతో గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. జగన్ కేబినెట్‌లో చోటు దక్కించుకున్నవారు వీళ్లే..
ధర్మాన కృష్ణదాస్ (శ్రీకాకుళం)
బొత్స సత్యనారాయణ (విజయనగరం)
పాముల పుష్ప శ్రీవాణి (విజయనగరం)
అవంతి శ్రీనివాస్ (విశాఖ)
కురసాల కన్నబాబు (తూర్పుగోదావరి)
పినిపె విశ్వరూప్ (తూర్పుగోదావరి)
పిల్లి సుభాష్‌చంద్రబోస్ (తూర్పుగోదావరి)
కొడాలి నాని (కృష్ణా)
వెల్లంపల్లి శ్రీనివాస్ (కృష్ణా)
పేర్ని నాని (కృష్ణా జిల్లా)
బాలినేని శ్రీనివాస్‌రెడ్డి (ప్రకాశం)
మేకపాటి గౌతమ్ రెడ్డి (నెల్లూరు)
బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి (కర్నూలు)
ఆళ్ల నాని (పశ్చిమ గోదావరి)
చెరుకువాడ శ్రీరంగనాథ రాజు (పశ్చిమ గోదావరి)
తానేటి వనిత (పశ్చిమ గోదావరి)
మేకతోటి సుచరిత (గుంటూరు)
మోపిదేవి వెంకటరమణ (గుంటూరు)
ఆదిమూలపు సురేష్ (ప్రకాశం)
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (చిత్తూరు)
గుమ్మనూరు జయరాం (కర్నూలు)
నారాయణస్వామి (చిత్తూరు)
అంజాద్ బాషా (కడప)
శంకర్‌నారాయణ (అనంతపురం)
అనిల్‌కుమార్ యాదవ్ (నెల్లూరు)



