వైకాపా గెలిస్తే బీజేపీ గెలిసినట్టే అని అనుకుంటున్నారా?

YS Jagan boycotting assemblyవచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి ఎపిలో ఇరవై సీట్లు మించి రావని బిజెపి జోస్యం చెప్పింది. ఆ పార్టీ అదికార ప్రతినిది కోట సాయికృష్ణ మాట్లాడుతూ ఈ జోస్యం చెప్పారు.ఏపీలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు సర్వేల్లో వ్యక్తమవుతోందని, ఇదేవిధంగా ప్రజా వ్యతిరేకత టీడీపీపై కొనసాగితే వచ్చే ఎన్నికల్లో 20 సీట్లకు మించి రావని జోస్యం చెప్పారు.

[m9ad]

ADVERTISEMENT

టీడీపీకి వైకాపాకు సర్వేల్లో 5 నుంచి 6 శాతం ఓట్ల తేడా ఉంది..రానున్న రోజుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. చంద్రబాబు నాయుడు ఏపీ ప్రజలను గ్రాఫిక్స్‌తో భ్రమలలో ముంచుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు.

ఇదంతా బానే ఉంది ఇంతకు బీజేపీ పరిస్థితిని సర్వేలు ఏం చెబుతున్నాయో కూడా తెలుసుకుంటే మంచిది కదా? ఎంత సేపు జగన్ కు అన్ని ఓట్లు వస్తాయి ఇన్ని సీట్లు వస్తాయి అని చెబితే అది బీజేపీకి ఎలా ఉపయోగపడుతుంది? లేకపోతే వైకాపా గెలిస్తే బీజేపీ గెలిసినట్టే అని ఏమన్నా అనుకుంటున్నారా?

ADVERTISEMENT
Latest Stories