
వైసీపీ రాజకీయానికి కాదేది అనర్హం అన్నట్టుగా మారిపోయింది. కుల రాజకీయాలతో మొదలై మత రాజకీయాల వరకు, చిన్న పిల్లల నుంచి రాజకీయాలకు సంబంధం లేని మహిళల వరకు వైసీపీ చేసే రాజకీయం నిజంగా నీచాతి నీచమనే చెప్పాలి.
రాజకీయాన్ని రాజకీయంలా ఎదుర్కోలేక దాన్ని పక్క దారి పట్టించి నిత్యం ఎదో ఒక వివాదం సృష్టించడమే వైసీపీ లక్ష్యంగా మారిపోయింది. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కుమారుడు కి సింగపూర్ స్కూల్ లో జరిగిన అగ్ని ప్రమాదం, ఇక ఆ పై నిన్న ఆయన భార్య అన్నా లెజినోవా తిరుమల యాత్ర వరకు వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న దుష్ప్రచారం సైకోలను తలపిస్తున్నాయి.
Also Read – పేరుకే నేను క్యాప్టెన్.. బ్యాటింగ్ చేసి గెలిపించాల్సింది మీరే!
ఏడెనిమిదేళ్ళ పసివాడు భారీ ప్రమాదం నుంచి తప్పించుకుని, కోలుకుంటున్న సమయంలో ఆ కుటుంబానికి అండగా నివాల్సింది పోయి ఆ పసి బిడ్డ మీద కూడా వైసీపీ సోషల్ మీడియా తన ఉన్మాదాన్ని ప్రదర్శించింది. ఇక ఇప్పుడు పవన్ సతీమణి అన్నా తిరుమలలో చెల్లించుకున్న మొక్కుల పై కూడా నీచ రాజకీయం మొదలు పెట్టింది.
దైవబలాన్ని నమ్మే కుటుంబాలు తమ కుటుంబంలో ఎదురయ్యే అనుకోని ఆపద నుంచి బయటపడినప్పుడు సహజంగా తానూ నమ్మిన దైవానికి మొక్కులు మొక్కడం, ఆ తరువాత వాటిని నెరవేర్చుకోవడం అనేది చేస్తుంటారు. అయితే నేడు క్రిస్టియన్ అయిన అన్నా కూడా తన కుమారుడు అగ్ని ప్రమాదం నుంచి తప్పించుకోవడంతో తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించి తమ మొక్కు చెల్లించుకున్నారు.
Also Read – పాకిస్థాన్‌కు ఓ యుద్ధం కావాలి.. భారత్ చేస్తుందా?
అయితే ఇప్పుడు ఇదే విషయం పై రాజకీయం మొదలు పెట్టిన వైసీపీ అందుకు తగ్గట్టుగా మహిళలు తల నీలాలు సమర్పించకూడదు అంటూ గరికపాటి వారు చెప్పిన ప్రవచనాలను సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తూ అన్నా తప్పు చేసారు అనే ధోరణిలో రాజకీయం చేస్తున్నారు. అయితే మహిళలు తలనీలాలు సమర్పించడం అనేది ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చిన సంస్కృతేమి కాదు.
నిత్యం వేలాదిమంది తిరుమలలో శ్రీవారికి తల వెంట్రుకలు సమర్పించుకుంటారు. అయితే అందులో పురుషులతో పాటుగా మహిళలు, చిన్నారులు కూడా ఉంటారు. మహిళలు తలనీలాలు సమర్పించడం అనేది తప్పా ఒప్పా అనేదానికన్నా ఇది వారి మనోభావాలకు, వారి నమ్మకాలకు సంబంధించిన అంశంగా పరిగణించాలి. ఇటువంటి వాటి పై కూడా వైసీపీ రాజకీయాలకు పాల్పడుతుంది అంటే అది వైసీపీ నీచత్వమే అవుతుంది.
Also Read – ఆంధ్రాపై కేసీఆర్ ఎఫెక్ట్.. తగ్గేదెప్పుడు?
ఇతర మతస్తురాలై ఉండి కూడా హిందూ మత సంప్రదాయాలను పాటిస్తూ, హిందుత్వం మీద తనకున్న గౌరవాన్ని, ప్రేమను చాటిచెపుతూ, తిరుమల నిత్యాన్నదాన కార్యక్రమానికి 17 లక్షలు విరాళం గా ఇచ్చినందుకు గాను అన్నా చర్యలను ప్రశంసించాల్సింది పోయి ఇలా పసి పిల్లాడి ప్రాణం పై, దానికి సంబంధించిన మొక్కుల పై, ఆచార సంప్రదాయాల పై వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న రాజకీయం నిజంగా సమాజానికి అత్యంత హానికరమనే చెప్పాలి.