వైసీపి నీచ రాజకీయాలకు ఇంతకంటే నిదర్శనం ఉంటుందా?

YSRCP Pensioners

ఓటమి భయంతో తీవ్ర ఆందోళనతో ఉన్న వైసీపి ఈ ఎన్నికలలో గెలిచేందుకు ప్రతీ అంశంపై రాజకీయాలు చేస్తోంది. వైసీపి ఆడుతున్న ఈ వికృత రాజకీయక్రీడలో వయో వృద్ధులను కూడా పావులుగా వాడుకోవడానికి వెనుకాడకపోవడం చాలా దారుణం.

పింఛన్ల విషయంలో చంద్రబాబు నాయుడు ఈసీకి చేసిన సూచనలను ఓ రాజకీయ అస్త్రంగా ఉపయోగించుకొని ఎన్నికలలో టిడిపిని దెబ్బతీయాలని జగన్‌ తహతహలాడుతున్నారని ఆయన మాటలలోనే స్పష్టమవుతోంది.

ADVERTISEMENT

పింఛన్ల పంపిణీపై ఈసీ చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఈ వ్యవహారాన్ని వివాదస్పదం చేయడానికి వైసీపి సొంత మీడియా, సోషల్ మీడియాలో చేస్తున్న దుష్ప్రచారం వైసీపి నీచ రాజకీయాలకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

ఓ కుటుంబంలో ఎవరికైనా హటాత్తుగా గుండెపోటు లేదా మరో తీవ్ర ఆరోగ్య సమస్య వస్తే, కుటుంబ సభ్యులు ఎవరికోసమో ఎదురు చూడరు. వెంటనే ఆస్పత్రికి తరలించి కాపాడుకోవాలని ప్రయత్నిస్తారు. అదే విదంగా జగన్మోహన్‌ రెడ్డి కూడా నిత్యం ‘నా అవ్వాతాతలు నా అక్కా చెల్లెమ్మలు’ అంటూ అందరిపై చాలా ప్రేమ ఒలకబోస్తుంటారు కనుక ఒకవేళ వారికి చంద్రబాబు వలన ఇబ్బంది కలుగుతోందని అనుకుంటే, ఈసీ ఆదేశాల కోసం ఎదురు చూడకుండా వెంటనే ప్రత్యామ్నాయమార్గాల ద్వారా వారందరికీ పింఛన్లు అందజేసి ఉండాలి. కానీ పింఛన్ల వ్యవహారాన్ని ఇంకా వివాదాస్పదం చేయడానికే మొగ్గు చూపారు!

ఈవిషయంలో కూడా వైసీపి దురాలోచనతో ఎంత వేగంగా స్పందించిందంటే, కొన్ని గంటల వ్యవధిలోనే వయోవృద్ధులు పింఛన్ల కోసం నానా కష్టాలు పడుతున్నట్లు వీడియోలో తయారుచేయించి, అన్ని టీవీ ఛానల్స్, సోషల్ మీడియాలో పెట్టేసింది.

అదే సమయంలో టిడిపి మాత్రం వైసీపి దుష్ప్రచారాన్ని ఖండించడానికే పరిమితం అయ్యింది తప్ప పోటీగా అది కూడా వీడియోలు చేయించి అప్‌లోడ్‌ చేయించలేదు! టిడిపి, వైసీపిలు… ఆ పార్టీల అధినేతల మద్య ఉన్న ఈ తేడాయే వైసీపి కంటే టిడిపిని ఎల్లప్పుడూ ఓ మెట్టుపైనే నిలుపుతోందని చెప్పుకోవచ్చు.

మరోపక్క జగన్మోహన్‌ రెడ్డితో సహా వైసీపి నేతలందరూ కూడా వాలంటీర్ల ద్వారా పింఛన్లు చెల్లించకుండా చంద్రబాబు నాయుడే అడ్డుపడ్డారని పదేపదే చెపుతుండటం గమనిస్తే, ఈ పింఛన్ల వ్యవహారంతో వైసీపి ఏవిదంగా వికృత రాజకీయ క్రీడ ఆడుతోందో, దాని నుంచి రాజకీయ లబ్ధి పొందడానికి ఎంతగా తహతహలాడుతోందో అర్ధం చేసుకోవచ్చు.

దేశంలో మరే రాష్ట్రంలో వాలంటీర్లు లేరు అయినా అన్ని రాష్ట్రాలలో ప్రభుత్వాలు వృద్ధులు, వికలాంగులకు టంచనుగా నెలనెలా పింఛన్లు ఇస్తూనే ఉన్నాయి.

ఇదివరకు సమైక్య రాష్ట్రంలో, విభజిత ఏపీ రాష్ట్రంలో కూడా అలాగే పింఛన్లు పంపిణీ అయ్యేవి. జగన్‌ కొత్తగా వాలంటీర్లను సృష్టించి వారితో ఇంటి వద్దే పింఛన్లు అందిస్తున్నారు. అదేదో చాలా గొప్ప విషయమన్నట్లు డబ్బా కొట్టుకుంటూనే ఉన్నారు.

కానీ ఇప్పుడు జగన్‌ కుర్చీలో నుంచి దిగి పోయే ముందే వాలంటీరర్లు లేకపోయినా అందరికీ పింఛన్లు ఇవ్వగలుగుతున్నారు. అంటే తాను సృష్టించిన ఈ వాలంటీర్ల వ్యవస్థ అవసరమే లేదని స్పష్టమవుతోంది కదా?

ఇన్ని తప్పులు, ఇంత నీచ రాజకీయాలు చేస్తూ మళ్ళీ అవ్వతాతలకు మేలు చేస్తున్నానని చెప్పుకోవడం వైసీపికే చెల్లునేమో?

ADVERTISEMENT
Latest Stories