రేపు ప్రభుత్వం మారితే వీరి పరిస్థితి ఏమిటి?

Buggana-Rajendranath-Reddy-Peddireddy-Ramachandra-Reddy-Roja-Selvamani-Jogi-Rameshఏపీ కొందరు మంత్రులకు ఏవో శాఖలు కేటాయించినప్పటికీ వారిని ప్రధానంగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌లను అవహేళన చేయడానికి కేటాయించిన్నట్లనిపిస్తుంది. వారెవరెవరో ప్రజలందరికీ తెలుసు.

అయితే ఈవిదంగా తాము ఎప్పుడూ మీడియా ముందుకు వచ్చి చవుకబారుగా మాట్లాడుతుంటే తమ గురించి రాష్ట్ర ప్రజలు ఏమనుకొంటారు?తమ నియోజకవర్గాలలో ప్రజలు ఏమనుకొంటారు?అనే ఆలోచన చేసిన్నట్లు కనబడదు. ఆ స్పృహ ఉండి ఉంటే ఇంత దిగజారి మాట్లాడేవారే కారు.

ADVERTISEMENT

జగన్‌ మంత్రి వర్గంలో పెద్దిరెడ్డి, బుగ్గన వంటి మరికొందరు మంత్రులు కూడా చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌లను అప్పుడప్పుడు సందర్భాన్ని బట్టి విమర్శిస్తుంటారు. కానీ వారు ఎప్పుడూ ఇంత చవుకబారుగా మాట్లాడలేదు. మంత్రులుగా తమ హుందాతనాన్ని పాటిస్తుంటారు.

కానీ చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌లను అవహేళన చేస్తూ మంచి మీడియా ఫోకస్‌లో ఉంటున్నామని సంబరపడుతున్న కొందరు వైసీపీ మంత్రులు తమ రాజకీయ భవిష్యత్‌ను తామే నాశనం చేసుకొంటున్నారని చెప్పకతప్పదు.

ఉదాహరణకు ఇటీవల వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్‌ పార్టీ నుంచి బయటకు వచ్చేందుకు సిద్దపడగానే టిడిపి, జనసేనలు ఆయనకు సాదరంగా ఆహ్వానం పలికాయి. ఎందుకంటే ఆయనకు రాజకీయాలలో, ప్రజలలో కూడా మంచి పేరుంది. ఆయన ఏనాడూ ఈ మంత్రులు మాదిరిగా చవుకబారుగా మాట్లాడలేదు. హుందాతనం పాటిస్తుంటారు. అటువంటివారు తమ పార్టీలో ఉండాలని అన్ని పార్టీలు కోరుకొంటాయి. కానీ ఇటువంటి చవుకబారు మాటలు మాట్లాడేవారిని కాదు.

కనుక సదరు మంత్రులకి వైసీపీలో తప్ప మరే పార్టీలోకి ప్రవేశం లభించదు. ఒకవేళ వచ్చే ఎన్నికలలో వైసీపీ ఓడిపోతే వారు కూడా దానితోనే మునగాలి తప్ప వారికి వేరే ఆప్షన్స్ ఉండవు. చాలా దూరదృష్టితో ఆలోచించే వారి అధినేత జగన్‌ ఇటువంటివారు తన చేజారిపోకుండా ఉండేందుకే వారికి ఈ డ్యూటీ కేటాయించి ఉండవచ్చు. తద్వారా వారి నోటితోనే వారు అందరూ తమని దూరం పెట్టేలా చేశారేమో?

ఇప్పుడు మంత్రిపదవులు, అధికారం చేతిలో ఉన్నాయి కదా అని చెలరేగిపోతున్న సదరు మంత్రులు, ఒకవేళ వచ్చే ఎన్నికలలో వైసీపీ ఓడిపోతే తమ పరిస్థితి ఏమిటని ఆలోచించారో లేదో? ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌,నారా లోకేష్‌లను ఇంతగా అవహేళన చేసినందుకు, రేపు వారికీ తగినవిదంగా బుద్ధి చెప్పకుండా ఉంటారా?అప్పుడు వారు ఈ రాష్ట్రంలోనే ఉంటారా లేక వారి ఎంపీ రఘురామకృష్ణరాజులాగ రాష్ట్రం విడిచి వేరే రాష్ట్రానికి పారిపోతారా?వారే ఆలోచించుకోవాలి.

ADVERTISEMENT
Latest Stories