జగన్ సీఎం కావాలంటూ తిరుమలకు ఎమ్మెల్యే పాదయాత్ర

ysrcp mla gopireddy srinivasa reddy padayatra to tirumalaనరసరావుపేట శాసనసభ్యుడు గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలంటూ తిరుమలకు పాదయాత్రను నిర్వహిస్తున్నారు. 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అఖండ మెజారిటీతో గెలవడం ఖాయమన్నారు. అలాగే జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అవడం తధ్యమన్నారు గోపిరెడ్డి.

ఈ రకంగా గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి జగన్ కంటే ముందే పాదయాత్ర స్టార్ట్ చేసినట్టు అయ్యింది. మరో వైపు నవంబర్ 2 నుండి జగన్ అన్నొస్తున్నాడు పేరుతో 3500 కిలోమీటర్ల పాదయాత్ర మొదలు పెట్టబోతున్నారు. 6 నెలల పాటు 3600 కిలోమీటర్ల దూరం నడవాలని ఆయన ప్రణాళిక.

ADVERTISEMENT

ఈ ప్రక్రియలో ఆయన 120 నియోజకవర్గాలను కవర్ చెయ్యబోతున్నారు. ఈ పాదయాత్ర ఆయనను ముఖ్యమంత్రి సింహాసనంలో కూర్చోబెడుతుందని ఆయన నమ్మకం. 120 నియోజకవర్గాల పాదయాత్ర తరువాత జగన్ 50 నియోజకవర్గాలలో బస్సు యాత్ర చెయ్యనున్నారు. తద్వారా అన్ని నియోజకవర్గాలు కవర్ చెయ్యాలని ఆయన ప్లాన్.

ADVERTISEMENT
Latest Stories