వైఎస్సాఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజా మరోసారి తన నోటిదురుసును బయటపెట్టారు. అది నోటి దురుసు అనాలో లేదా ఆ పార్టీ ఓర్వలేనితనం అనాలో అర్ధం కాకుండా ఉంది. కేంద్రం పై టీడీపీ చేస్తున్న పోరాటం ఎక్కడ ప్రజల్లోకి వెళ్లిపోతుందో అని ఆ పార్టీ భయపడుతున్నట్టుగా కనిపిస్తుంది.
ఎక్కడ టీడీపీకు ప్రజల్లో మంచి పేరు వచ్చేస్తుందో అని ఉన్న ఫళంగా రాజీనామాల అంశం తెర మీదకు తెచ్చింది వైకాపా. మరో వైపు ఆ పార్టీ నాయకులు టీడీపీలో పోరాటం చేస్తున్న నాయకుల పై ఎదురు దాడి చేస్తున్నారు. గల్లా జయదేవ్ పార్లమెంట్‌లో తీవ్ర నిరసన వ్యక్తంచేసిన విషయం తెలిసిందే. ఒక్క మాటలో చెప్పాలంటే మోదీ ప్రభుత్వాన్ని కడిగి పారేశారు.
అయితే రోజా ఏం సాధించారని ఆ గుండాయనకు సన్మానాలు చేస్తున్నారంటూ గల్లా జయదేవ్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయవాడ సెక్స్ రాకెట్‌లో ఉన్న బోడె ప్రసాద్ గుండు కొట్టించుకుంటే.. మరో గుండాయన సన్మానాలు చేయించుకుంటున్నారు అని రోజా అన్నారు. అయితే జయదేవ్ స్పీచ్ వైకాపాని భాగానే కలవరపెట్టినట్టు ఉంది.



