మహిళా ఎమ్మెల్యే పై జనసేన అభిమానుల స్వీట్ రివెంజ్

ysrcp mla weeps infront of mediaతాడికొండ సమీపంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌ను నివాసం కోసం సురేష్ అనే వ్యక్తి అద్దెకు తీసుకున్నారు. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ప్రధాన అనుచరుడిగా చెప్పబడుతున్న అతను అక్కడే పేకాట క్లబ్‌ను నిర్వహిస్తున్నారట. సమాచారం అందుకున్న పోలీసులు ఆ అపార్ట్మెంట్ మీద దాడి చేయడంతో సురేష్ పరారయ్యాడు.

అయితే దీనిలో ఎమ్మెల్యేకు కూడా సంబంధం ఉందని పలువురు ఆరోపణ. దీనికి సంబంధించి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యే కంటతడి పెట్టుకున్నారు. తాను డాక్టర్ ని అని ఒక సర్జరీ చేస్తే లక్షలు వస్తాయని పేకాట క్లబ్ నిర్వహించాల్సిన కర్మ తనకు పట్టలేదని ఆమె చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయంగా జనసేన అభిమానులు ఆమె పై విరుచుకుపడుతున్నారు.

ADVERTISEMENT

ఒక టీవీ ఇంటర్వ్యూలో ఆమె పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వద్ద ప్యాకేజీ తీసుకున్నారని ఆరోపించారు. జనసేన ప్రతినిధి నిరూపించమని సవాలు చేసినా ఆమె పట్టించుకోకుండా అవే విమర్శలు చేసుకుంటూ పోయారు. “లక్షలు సంపాదించే మీకు పేకాట క్లబ్ నిర్వహించాల్సిన కర్మ లేదు. కోట్లు సంపాదించే పవన్ కు ప్యాకేజీ తీసుకోవాల్సిన అవసరం ఏంటి?,: అని జనసైనికులు ప్రశ్నిస్తున్నారు.

ఇది ఇలా ఉండగా… మహిళా ఎమ్మెల్యే అని కూడా చూడకుండా తనపై దుష్పప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై జరుగుతున్న రాజకీయ కుట్రపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని శ్రీదేవి అంటున్నారు. తన జరుగుతున్నా తప్పుడు ప్రచారంపై డీజీపీని కూడా కలుస్తానని తెలిపారు.

ADVERTISEMENT
Latest Stories